Faf du Plessis: ముంబయి వర్సెస్ ఢిల్లీ... ప్లే ఆఫ్ బెర్తు కావాలంటే మ్యాచ్ గెలవాల్సిందే!

Faf du Plessis Delhi Capitals to Bowl First Against Mumbai Indians
  • ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ కీలక పోరు
  • ముంబై వాంఖడే స్టేడియం మ్యాచ్‌కు వేదిక
  • టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్
  • తొలుత బౌలింగ్ చేయాలని నిర్ణయం
  • హార్దిక్ పాండ్యా సేన మొదట బ్యాటింగ్ 
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టాస్ గెలిచింది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తాత్కాలిక కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఎలాంటి తడబాటు లేకుండా తొలుత బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో, ముంబై ఇండియన్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ రెగ్యులర్ కెప్టెన్ అక్షర్ పటేల్ బరిలో దిగడం లేదు. అతడి స్థానం డుప్లెసిస్ నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. 

కాగా, ఐపీఎల్-2025 ప్లే ఆఫ్ దశకు ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు చేరుకోగా... నాలుగో బెర్తు కోసం ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య గట్టి పోటీ ఉంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంటాయి.  

వాంఖడే పిచ్ సాధారణంగా ఛేదనకు అనుకూలిస్తుందన్న అంచనాలతో ఢిల్లీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముంబై ఇండియన్స్ తమ సొంత మైదానంలో భారీ స్కోరు చేసి, ఢిల్లీపై ఒత్తిడి తేవాలని చూస్తుండగా, పటిష్టమైన బౌలింగ్‌తో ముంబైని కట్టడి చేయాలని ఢిల్లీ క్యాపిటల్స్ భావిస్తోంది.

ముంబై ఇండియన్స్ తుది జట్టు
రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), విల్ జాక్స్, నమన్ ధిర్, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), మిచెల్ శాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా.

ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు
ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, మాధవ్ తివారీ, కుల్దీప్ యాదవ్, దుష్మంత చమీర, ముస్తాఫిజుర్ రెహ్మాన్, ముఖేష్ కుమార్.
Faf du Plessis
Mumbai Indians
Delhi Capitals
IPL 2025
Indian Premier League
Wankhede Stadium
Axar Patel
Rohit Sharma
Hardik Pandya
Cricket

More Telugu News