ఓ సామాన్యుడి ప్రతీకారంగా 'వల్లమై' .. ఓటీటీలో!

  • తమిళంలో రూపొందిన 'వల్లమై'
  • తండ్రీ కూతుళ్ల ఎమోషన్స్ చుట్టూ తిరిగే కథ 
  • ఈ నెల 23 నుంచి 'ఆహా తమిళ్'లో స్ట్రీమింగ్ 
  • 'టెంట్ కొట్టా'లోను అందుబాటులోకి  

ఓటీటీ ప్రేక్షకులను పలకరించడానికి 'వల్లమై' సినిమా రెడీ అవుతోంది. ఇది తమిళ రివేంజ్ డ్రామా. ప్రేమ్ జీ అమరన్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి, కరుప్పయా మురుగన్ దర్శకత్వం వహించాడు. క్రితం నెలలో 25వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. అక్కడ ఓ మాదిరి టాక్ ను మాత్రమే రాబట్టిన ఈ సినిమా, ఈ నెల 23వ తేదీ నుంచి ఆహా తమిళ్ లోను .. టెంట్ కొట్టాలోను స్ట్రీమింగ్ కానుంది. 

తండ్రీ కూతుళ్ల ఎమోషన్స్ కి సంబంధించిన కథ ఇది. తండ్రి శరవణన్ రాత్రివేళ పోస్టర్లు అంటించే చిన్నపని చేస్తూ ఉంటాడు. అతనికి వినికిడి శక్తికి సంబంధించిన లోపం ఉంటుంది. తన కూతురికి ఎలాంటి లోటు రానీయకుండా అతను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. అయితే కొంతమంది కుర్రాళ్లు ఆ ఆమ్మాయిపై అఘాయిత్యం చేస్తారు. వాళ్లపై ప్రతీకారం తీర్చుకోవాలని శరవణన్ నిర్ణయించుకుంటాడు. 

ఆయన కూతురును జీవితాన్ని పాడుచేసిన ఆ దుర్మార్గులు ఎవరు? వాళ్లపై ప్రతీకారం తీర్చుకోవడానికి శరవణన్ ఏం చేస్తాడు? ఆయన ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయి? అనేది కథ. కూతురు పాత్రలో దివ్యదర్శిని నటించగా, ఇతర ముఖ్యమైన పాత్రలలో దీపాశంకర్ .. రంజిత్ తదితరులు కనిపించనున్నారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ ఏ స్థాయిలో  ఓటీటీ ఆడియన్స్ ను అలరిస్తుందనేది చూడాలి మరి. 



More Telugu News