: అందువల్లనే అవకాశాలు పోయాయంటే మీరు నమ్ముతారా?: నటి పూజిత

Actress Poojitha Interview
  • ఒకప్పుడు హీరోయిన్ సక్సెస్ లు 
  • ఆ తరువాత కేరక్టర్ ఆర్టిస్టుగా బిజీ లైఫ్ 
  • తనకి పొగరనే టాక్ ఉందని వెల్లడి
  • ఆత్మాభిమానం ఎక్కువని వివరణ 
ఒకప్పుడు కథానాయికగా వరుస సినిమాలు చేస్తూ వెళ్లిన పూజిత, ఆ తరువాత కేరక్టర్ ఆర్టిస్టుగాను బిజీ లైఫ్ ను చూశారు. వివిధ భాషలలో 136 సినిమాలు చేశారు. తాజాగా ఆమె 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. " కాలేజ్ రోజుల నుంచి నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. అందువల్లనే సినిమాల వైపు వచ్చాను. మా నాన్నకు ఇష్టం లేకపోయినా, ఆయన ఒప్పుకోవలసి వచ్చింది" అని అన్నారు. 

ఇండస్ట్రీ హైదరాబాద్ కి వచ్చినపుడు నేను కూడా వచ్చాను. అందువలన అప్పటివరకూ ఇతర భాషలలో హీరోయిన్ గా చేస్తూ వచ్చిన నేను, తెలుగులో కేరక్టర్ ఆర్టిస్టుగా చేయవలసి వచ్చింది. నాకు పొగరు కాస్త ఎక్కువేనని అంటూ ఉంటారు. పొగరు ఎంట్రీ ఇచ్చిన కాసేపటికి నేను ఎంటర్ అవుతానని కూడా చెబుతూ ఉంటారు. నేను మాత్రం అది నా ఆత్మాభిమానంగా భావిస్తాను. తేడా వస్తేనే ఎవరినీ వదిలిపెట్టను. పొగరు వలన ఏం కోల్పోయానంటే .. అవకాశాలను కోల్పోయాననే చెబుతాను. ఏం చేస్తాం .. అది నా నైజం"అని చెప్పారు. 

"ఒకసారి సురేశ్ ప్రొడక్షన్స్ వారి నుంచి కాల్ వచ్చింది. ఒక  పాత్ర ఉందని చెబితే వెళ్లాను. నలుగురిలో నన్ను ఒకదానిగా నిలబెట్టారు. నాకు కాకుండా కొత్తగా వచ్చిన మరో ఆర్టిస్టుకి డైలాగ్ ఇచ్చారు. నాకు చాలా చిన్నతనంగా అనిపించడంతో, చెప్పకుండానే సెట్ నుంచి వచ్చేశాను. ఆ మరుసటి రోజు ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. ఇకపై ఆ బ్యానర్లో చేయనని తేల్చి చెప్పాను .. అలాగే చేయలేదు కూడా. నాలోని ఆర్టిస్టును అవమానిస్తే నేను తట్టుకోలేను" అని అన్నారు.   

More Telugu News