Jyothirmayi: ప్రభుత్వ ఆసుపత్రిలో జడ్జి ప్రసవం.. అభినందిస్తూ మంత్రి ట్వీట్

Judge Jyothirmayi Delivers Baby in Government Hospital Minister Congratulates
--
వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా జడ్జి జ్యోతిర్మయి సోమవారం పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. సాధారణ కాన్పు ద్వారా మగబిడ్డ జన్మించాడని వైద్యులు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అందించే సేవలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా న్యాయమూర్తి స్వయంగా ఇక్కడ సేవలు పొందడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యసేవలు పొంది అందరికీ ఆదర్శంగా నిలిచారని సీనియర్‌ కోర్టు ఏజీపీ ప్రశాంత్‌కుమార్, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గుండ రవి, కార్యవర్గ సభ్యులు, న్యాయవాదులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. న్యాయమూర్తి జ్యోతిర్మయి వేములవాడ జిల్లా కోర్టులో విధులు నిర్వహిస్తున్నారు.

కాగా, 2023లోనూ ఇదే ఆసుపత్రిలో ఆమె ఆడపిల్లకు జన్మనివ్వడం విశేషం. కాగా, ఈ విషయం తెలిసి వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ట్విట్టర్ ద్వారా న్యాయమూర్తి జ్యోతిర్మయికి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులలో అనుభవం, నైపుణ్యం కలిగిన వైద్యులు అందుబాటులో ఉంటారని, వారి సేవలు పొందాలని ఆయన ప్రజలకు సూచించారు. ప్రజాప్రభుత్వంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేశామని మంత్రి దామోదర పేర్కొన్నారు.
Jyothirmayi
Vemulawada Government Hospital
Judge Jyothirmayi
Telangana High Court
Government Hospital Delivery
Damodara Rajanarsimha
Telangana Health
Normal Delivery
Public Healthcare

More Telugu News