Stock Markets: ఐటీ కంపెనీల ఎఫెక్ట్... నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

Stock Markets End Lower Sensex Down 271 Points
  • అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు
  • 271 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 85.40
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో పాటు గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణతో మార్కెట్లు నష్టపోయాయి. ఐటీ కంపెనీల షేర్లు ఒత్తిడికి గురి కావడం కూడా నష్టాలకు మరో కారణం.

ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 271 పాయింట్లు నష్టపోయి 82,059కి పడిపోయింది. నిఫ్టీ 74 పాయింట్లు కోల్పోయి 24,945 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 85.40గా ఉంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.27%), బజాజ్ ఫైనాన్స్ (0.95%), ఎన్టీపీసీ (0.58%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.39%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (0.26%).

టాప్ లూజర్స్
ఇన్ఫోసిస్ (-1.92%), టీసీఎస్ (-1.23%), టెక్ మహీంద్రా (-1.19%), రిలయన్స్ (-1.03%), ఏషియన్ పెయింట్స్ (-1.01%).
Stock Markets
Sensex
Nifty
Indian Stock Market
Share Market
Stock Market Today
IT Stocks
Rupee vs Dollar
Market Updates
Trading

More Telugu News