బెంగళూరు వరద ప్రభావిత ప్రాంతాల్లో జేసీబీపై ఎమ్మెల్యే పర్యటన
- సాయ్ లేఅవుట్ లో ఇళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే
- సహాయక చర్యలపై అధికారులకు కీలక సూచనలు
- భారీ వర్షానికి జలమయమైన నగరం, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం
బెంగళూరులో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో సోమవారం స్థానిక ఎమ్మెల్యే బి.బసవరాజ్ సాయ్ లేఅవుట్ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో జేసీబీపై పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. వరద నీటిలో చిక్కుకున్న నివాస ప్రాంతాల్లో పర్యటించి, అధికారులకు తగిన సూచనలు చేశారు.
నగరంలోని అనేక ప్రాంతాలు మోకాళ్ల లోతు నీటిలో మునిగిపోయాయి. డ్రైనేజీ వ్యవస్థ వైఫల్యంతో వీధులు కాలువలను తలపిస్తున్నాయి. అనేక వాహనాలు పాక్షికంగా నీట మునిగిపోయాయి. సాయ్ లేఅవుట్, హోరమావు ప్రాంతాలపై వరద ప్రభావం ఎక్కువగా ఉంది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజల సామాగ్రి, ఎలక్ట్రానిక్ వస్తువులు తడిసిపోయి తీవ్ర నష్టం వాటిల్లింది. అధికారులు ప్రభావిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనుల్లో నిమగ్నమయ్యారు. ఇళ్లలోకి చేరిన వరద నీటిని జేసీబీల సాయంతో తొలగిస్తున్నారు. పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడటం, వాహనాలు నిలిచిపోవడంతో బెంగళూరులో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రరూపం దాల్చింది.