AP Liquor Scam: జ‌గ‌న్ గుండెల్లో గుబులు మొద‌లైంది: మంత్రి కొల్లు ర‌వీంద్ర‌

AP Liquor Scam Minister Kollu Ravindras Explosive Remarks on Jagan
  • ఏపీ లిక్క‌ర్ స్కామ్‌లో సిట్ విచార‌ణ గ‌త ప్ర‌భుత్వాన్ని భ‌య‌పెడుతుందన్న మంత్రి
  • అవినీతి బాగోతాలు బ‌య‌ట‌ప‌డ‌తాయ‌నే కూట‌మి ప్ర‌భుత్వంపై త‌ప్పుడు ప్ర‌చారాలంటూ వ్యాఖ్య‌
  • జ‌గ‌న్ హ‌యాంలో ప్ర‌పంచం విస్తుపోయేలా మ‌ద్యం కుంభ‌కోణం జ‌రిగింద‌న్న కొల్లు ర‌వీంద్ర‌
ఏపీ లిక్క‌ర్ స్కామ్‌లో సిట్ విచార‌ణ‌తో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ గుండెల్లో గుబులు మొద‌లైంద‌ని మంత్రి కొల్లు ర‌వీంద్ర అన్నారు. సిట్ విచార‌ణలో అవినీతి బాగోతాలు బ‌య‌ట‌కు వ‌స్తాయ‌నే కూట‌మి ప్ర‌భుత్వంపై త‌ప్పుడు ప్ర‌చారాలు చేస్తున్నార‌ని మంత్రి దుయ్య‌బ‌ట్టారు. 

జ‌గ‌న్ ప్ర‌భుత్వ హ‌యాంలో ప్ర‌పంచం విస్తుపోయేలా మ‌ద్యం కుంభ‌కోణం జ‌రిగింద‌ని అన్నారు. ఈ సంద‌ర్భంగా గాలిజ‌నార్ధ‌న్‌రెడ్డి వ్య‌వ‌హారాన్ని మంత్రి ర‌వీంద్ర గుర్తు చేశారు. ఆనాడు గాలిజ‌నార్ధ‌న్ రెడ్డి అవినీతిపై చంద్ర‌బాబు నాయుడు పోరాటం చేస్తే.. వైఎస్ఆర్ స‌హా చాలా మంది నిందారోప‌ణ‌లు చేశార‌ని తెలిపారు. 

కానీ, నేడు గాలిజ‌నార్ధ‌న్‌రెడ్డిని న్యాయ‌స్థానం దోషిగా తేల్చి శిక్ష విధించింద‌న్నారు. లిక్క‌ర్ స్కామ్‌లోనూ దోపిడీదారులు త‌ప్పించుకోవ‌డం అసాధ్య‌మ‌ని మంత్రి చెప్పారు. మద్యం కుంభ‌కోణానికి సంబంధించి త్వ‌ర‌లోనే అన్నీ నిజాలు బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని చెప్పుకొచ్చారు.  
AP Liquor Scam
Kollu Ravindra
Jagan Mohan Reddy
SIT Investigation
YSR Congress
Chandrababu Naidu
Gali Janardhan Reddy
Andhra Pradesh Politics
Corruption
Telugu News

More Telugu News