Mohammad Yunus: పనిలో పనిగా... బంగ్లాదేశ్‌పైనా ఆంక్షలు!

India Imposes Trade Restrictions on Bangladesh
  • బంగ్లాదేశ్‌కు బిగ్ షాక్ ఇచ్చిన భారత్
  • బంగ్లా వస్తువుల దిగుమతులపై భారత్ పోర్టు ఆంక్షలు
  • నోటిఫికేషన్ విడుదల చేసిన డీజీఎఫ్‌టీ
భారత్‌ బంగ్లాదేశ్‌కు బిగ్ షాక్ ఇచ్చింది. బంగ్లాదేశ్ నుంచి దిగుమతి అయ్యే రెడీమేడ్ దుస్తులు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు సహా ఇతర వస్తువులపై భారత్ ఆంక్షలు విధించింది. ఈ మేరకు వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.

తాజా నోటిఫికేషన్ ప్రకారం బంగ్లాదేశ్ నుంచి రెడీమేడ్ దుస్తులను కోల్‌కతా, నవా షెవా ఓడరేవుల ద్వారా మాత్రమే అనుమతించనున్నారు. అలాగే ఈశాన్యంలోని ల్యాండ్ ట్రాన్సిట్ పోస్టుల నుంచి కూడా పలు వస్తువుల దిగుమతిని నిషేధించింది. వీటిలో రెడీమేడ్ దుస్తులు, ప్రాసెస్డ్ ఫుడ్, ప్లాస్టిక్, ఫర్నిచర్, కార్బోనేటేడ్ పానీయాలు ఉన్నాయి. ఈ వస్తువులను మేఘాలయ, అసోం, త్రిపుర, మిజోరం, పశ్చిమ బెంగాల్‌లోని పుల్‌బారి, చంగ్రబంధలోని ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్లు, చెక్ పోస్టుల ద్వారా భారత్‌లోకి అనుమతించరు. అయితే, ఈ ఆంక్షలు భారత్ గుండా భూటాన్, నేపాల్‌లకు రవాణా చేసే బంగ్లాదేశ్ వస్తువులకు వర్తించవు.

బంగ్లాదేశ్ ఇప్పటి వరకు తన వస్తువులను భారత్‌లోని ఈశాన్య ప్రాంత మార్కెట్లకు ఎటువంటి పరిమితులు లేకుండా ఎగుమతి చేస్తోంది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇంతకు ముందు యూనస్ చైనా పర్యటనలో ఉన్న సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బంగాళాఖాతానికి బంగ్లాదేశ్ రక్షకుడని, భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలు ల్యాండ్ లాక్డ్‌గా ఉన్నాయని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు ఇస్తున్న ట్రాన్స్ షిప్‌మెంట్ సౌకర్యాన్ని భారత్ రద్దు చేసింది. 
Mohammad Yunus
Bangladesh
India
Trade Restrictions
Readymade Garments
Processed Food
Northeast India
Land Ports
Import Restrictions
Bilateral Relations

More Telugu News