Thug Life: కమల్ హాసన్ 'థగ్ లైఫ్' అఫిషియల్ ట్రైలర్ ఇదిగో!

- కమల్, మణిరత్నం కాంబోలో థగ్ లైఫ్
- ఇరువురి సొంత బ్యానర్లపై చిత్ర నిర్మాణం
- మే 24న ఆడియో రిలీజ్ ఫంక్షన్
ఎన్నో ఏళ్ల తర్వాత అగ్ర నటుడు కమల్ హాసన్, సీనియర్ దర్శకుడు మణిరత్నం కాంబోలో వస్తున్న చిత్రం థగ్ లైఫ్. కమల్ కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మణిరత్నంకు చెందిన మద్రాస్ టాకీస్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నేడు ఈ చిత్రం నుంచి అఫిషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. మణిరత్నం స్టయిల్లో కమల్ హాసన్ మార్క్ మిస్ కాకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. సింబు ప్రతినాయక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. మాంచి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో స్టోరీ అల్లుకున్నట్టు మణిరత్నం హింట్ ఇచ్చాడు.
ఇందులో కమల్ హాసన్, సింబు, త్రిష, ఐశ్వర్యలక్ష్మి, అశోక్ సెల్వన్, అభిరామి, జోజు జార్జ్, నాజర్, మహేశ్ మంజ్రేకర్, అలీ ఫజల్ నటించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం థగ్ లైఫ్ చిత్రానికి అదనపు ఆకర్షణ. కాగా, ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ ను మే 24న నిర్వహించాలని చిత్రబృందం నిర్ణయించింది.