Marri Rajasekhar Reddy: సమాచారం ఇవ్వకుండా మా భూముల్లో సర్వే ఎలా చేస్తారు?: ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డి
- సుచిత్రలో తన భూమి సర్వేపై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అభ్యంతరం
- ఇది చట్టవిరుద్ధమని వ్యాఖ్య
- సర్వే నంబర్ 82, 83లోని భూమిని చట్టబద్ధంగానే కొన్నానని స్పష్టం
మేడ్చల్ జిల్లా సుచిత్ర ప్రాంతంలోని తమ భూమిలో రెవెన్యూ అధికారులు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సర్వే చేపట్టడంపై మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వే నంబర్లు 82, 83లో గల తమ స్థలంలో అధికారులు నిన్న ఈ చర్యకు పాల్పడ్డారని, ఇది పూర్తిగా చట్ట విరుద్ధమని ఆయన ఆరోపించారు.
ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, "కోర్టు ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు పోలీసు బందోబస్తు నడుమ సర్వే చేయడాన్ని మేము వ్యతిరేకించడం లేదు. కానీ, న్యాయపరంగా భూ యజమానులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా, నోటీసులు జారీ చేయకుండా సర్వే చేపట్టడం ఎంతమాత్రం సరైంది కాదు" అని అన్నారు. చట్టప్రకారం, ఏదైనా భూమిలో సర్వే చేపట్టే 15 రోజుల ముందుగా స్థల యజమానికి నోటీసులు అందించాల్సి ఉంటుందని ఆయన గుర్తుచేశారు. అలాంటి నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా, పోలీసుల పహారాలో అధికారులు అత్యుత్సాహంగా వ్యవహరించి సర్వే పూర్తిచేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
తాము సర్వే నంబర్ 82, 83లోని భూమిని అన్ని నిబంధనలకు అనుగుణంగా, చట్టబద్ధంగానే కొనుగోలు చేశామని మర్రి రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో కొంతమంది వ్యక్తులు దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తూ, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని చూడటం సరైంది కాదని ఆయన హితవు పలికారు. అధికారుల చర్యపై న్యాయపరంగా ముందుకెళతామని ఆయన సూచనప్రాయంగా తెలిపారు.