Rohit Sharma: అందరిముందే సోదరుడిని తిట్టేసిన రోహిత్ శర్మ.. వైరల్ వీడియో!

ముంబయిలోని వాంఖడే స్టేడియంలో టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం లభించింది. హిట్‌మ్యాన్ పేరుతో శుక్రవారం కొత్త స్టాండ్ ప్రారంభమైంది. భారత జట్టుతో పాటు ముంబయి క్రికెట్‌కు రోహిత్ అందించిన సేవలకుగానూ ముంబయి క్రికెట్ అసోసియేషన్ (MCA) స్టేడియంలో ఓ స్టాండ్‌కు అతడి పేరును పెట్టి గౌరవించింది.
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో సహా అనేక మంది ప్రముఖుల సమక్షంలో అతని పేరు మీద ఒక స్టాండ్‌ను ప్రారంభించి సత్కరించింది.ఈ ప్రత్యేక కార్యక్రమానికి రోహిత్ శర్మ తన కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. భార్య రితిక, అతని తల్లిదండ్రులు, సోదరుడు విశాల్ ఈ కార్యక్రమానికి విచ్చేశారు.
ఈ సమయంలో హిట్‌మ్యాన్ తన సోదరుడు విశాల్‌ను మందలించిన సంఘటన చోటు చేసుకుంది. రోహిత్ తన తమ్ముడిని తిడుతున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో హిట్‌మ్యాన్ తన సోదరుడిపై ఆగ్రహం వ్యక్తం చేయడం ఉంది.
రోహిత్ కారు వైపు వేలు చూపిస్తూ... కారుకు సొట్టలు పడ్డాయి ఏంటి? అని అడిగాడు. అందుకు విశాల్... కారు రివర్స్ చేసేటప్పుడు జరిగిందంటూ బదులిచ్చాడు. దీంతో కోప్పడిన రోహిత్ శర్మ... నీకసలు బుర్ర ఉందా, చూసుకోవాలి కదా అంటూ కోప్పడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియోపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. కొందరు రోహిత్ శర్మ ప్రవర్తనను సమర్థిస్తుండగా, మరికొందరు సోదరుడిని బహిరంగ ప్రదేశంలో ఇలా తిట్టి ఉండాల్సింది కాదని అభిప్రాయపడుతున్నారు.