Chandrababu Naidu: నేడు కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

Chandrababu Naidus Kurnool Visit Today
  • కర్నూలు సీ క్యాంప్ రైతు బజారును పరిశీలించనున్న సీఎం చంద్రబాబు
  • కేంద్రీయ విద్యాలయం వద్ద జైరాజ్ స్టీల్ స్వచ్ఛాంధ్ర పార్క్‌కి శంకుస్థాపన చేయనున్న సీఎం
  • మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 5 గంటల వరకు టీడీపీ ముఖ్యనాయకులతో సమావేశమై దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11.25 గంటలకు ముఖ్యమంత్రి కర్నూలు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సీ క్యాంపు రైతు బజారుకు చేరుకుని, అక్కడ కూరగాయల వ్యర్థాలను ఎరువుగా మార్చే ప్రక్రియను పరిశీలిస్తారు.

రైతుబజారులోని రైతులు, పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖి నిర్వహించిన అనంతరం కేంద్రీయ విద్యాలయం సమీపంలో జైరాజ్ స్టీల్ స్వచ్ఛాంధ్ర పార్క్‌కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. తదుపరి 12.55 గంటలకు కేంద్రీయ విద్యాలయం వద్ద ప్రజావేదికలో పాల్గొని స్థానికులతో ముచ్చటిస్తారు. పీ 4 కార్యక్రమంలో భాగంగా రెండు బంగారు కుటుంబాలు, ఇద్దరు మార్గదర్శులతో మాట్లాడతారు. తర్వాత ప్రజావేదిక సభలో ప్రసంగించనున్నారు.

మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 5 గంటల వరకు టీడీపీ ముఖ్య నాయకులతో సమావేశమై ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కృషి చేసిన వారికి చంద్రబాబు అభినందనలు తెలియజేస్తారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం 5.35 గంటలకు కర్నూలు విమానాశ్రయానికి చేరుకుని హైదరాబాద్‌కు పయనమవుతారు. 
Chandrababu Naidu
Andhra Pradesh CM
Kurnool
Kurnool visit
TDParty
farmers market
Swachha Andhra Park
public meeting
political meeting
AP Politics

More Telugu News