Vallabhaneni Vamsi: వ‌ల్ల‌భ‌నేని వంశీపై మ‌రో కేసు న‌మోదు

Another Case Filed Against Vallabhaneni Vamsi

  • గన్నవరంలో అక్ర‌మ‌ మైనింగ్‌కు పాల్ప‌డ్డార‌ని మైనింగ్ ఏడీ ఫిర్యాదు 
  • గ‌న్న‌వరం పోలీస్ స్టేష‌న్‌లో వంశీపై కేసు న‌మోదు
  • రూ. 100 కోట్ల పైన అక్రమాలకు పాల్పడ్డారని వంశీపై మైనింగ్‌ ఏడీ ఫిర్యాదు

వైసీపీ నేత‌, గ‌న్న‌వ‌రం మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీపై మ‌రో కేసు న‌మోదైంది. గన్నవరం నియోజకవర్గంలో జరిగిన మైనింగ్‌ అక్రమాలపై గనుల శాఖ ఏడీ గ‌న్న‌వరం పోలీస్ స్టేష‌న్‌లో ఆయ‌న‌పై ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన అక్ర‌మ త‌వ్వ‌కాల‌పై నివేదిక‌ను పోలీసుల‌కు స‌మ‌ర్పించారు. 

2019-2024 సమయంలో వంశీ, ఆయన వర్గం అక్రమాలపై పాల్పడినట్టు నివేదికలో పేర్కొన్నారు. రూ. 100 కోట్ల పైన అక్రమాలకు పాల్పడ్డారని వంశీపై మైనింగ్‌ ఏడీ ఫిర్యాదు చేశారు. దీంతో గన్నవరం పోలీసులు వంశీపై కేసు నమోదు చేశారు. దీనిపైన పీటీ వారెంట్‌ కోర్టులో దాఖలు చేయాలని పోలీసులు నిర్ణయించారు. ఇక‌, ఇప్ప‌టికే ఆయ‌న వివిధ కేసుల్లో అరెస్టై జైలులో ఉన్న విష‌యం తెలిసిందే. 

Vallabhaneni Vamsi
Mining Scam
Gannavaram
Andhra Pradesh
Illegal Mining
YCP Leader
Former MLA
Criminal Case
Police Complaint
Corruption
  • Loading...

More Telugu News