TTD: టీటీడీకి ఎన్నారై భారీ విరాళం

- టీటీడీ వివిధ ట్రస్ట్‌లకు ఎన్నారై భాగవతుల ఆనంద్ మోహన్ భారీ విరాళం
- ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ కు రూ.1,00,01,116
- ఎస్వీ విద్యాదాన ట్రస్ట్ కు రూ.10,01,116
- ఎస్వీ వేదపరిరక్షణ ట్రస్ట్ కు రూ.10,01,116
- ఎస్వీ సర్వశ్రేయాస్ ట్రస్ట్ కు రూ.10,01,116
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ట్రస్ట్‌కు అమెరికాలోని బోస్టన్‌కు చెందిన ఎన్నారై భాగవతుల ఆనంద్ మోహన్ భారీ విరాళం ఇచ్చారు. ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ కు రూ.1,00,01,116, ఎస్వీ విద్యాదాన ట్రస్ట్ కు రూ.10,01,116, ఎస్వీ వేదపరిరక్షణ ట్రస్ట్ కు రూ.10,01,116, ఎస్వీ సర్వశ్రేయాస్ ట్రస్ట్ కు రూ.10,01,116 లు విరాళం అందజేశారు.
ఆనంద్ మోహన్ టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును క్యాంప్ కార్యాలయంలో కలిసి విరాళం తాలూకు డీడీలను అందజేశారు. ఈ సందర్భంగా దాతను టీటీడీ ఛైర్మన్ అభినందించారు.