సౌదీలో తెలుగు వ్య‌క్తి అనుమానాస్పద మృతి

  • ప‌దేళ్ల క్రితం జీవ‌నోపాధి కోసం సౌదీ వెళ్లిన‌ షేక్ తాజుద్దీన్
  • సూర్యాపేట జిల్లా కోదాడ ప‌ట్ట‌ణానికి చెందిన తాజుద్దీన్
  • దమామ్ న‌గరంలో కారు డ్రైవర్‌గా పని చేస్తూ జీవ‌నోపాధి 
  • ఇటీవల సొంతంగా కూరగాయల దుకాణం నిర్వహణ
  • ఈ క్ర‌మంలో ఇటీవ‌ల అనుమానాస్పద మృతి
తెలంగాణ‌లోని సూర్యాపేట జిల్లా కోదాడ ప‌ట్ట‌ణానికి చెందిన షేక్ తాజుద్దీన్ సౌదీ అరేబియాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బుధ‌వారం సాయంత్రం తాజుద్దీన్ చ‌నిపోయిన‌ట్లుగా అత‌డి స్నేహితులు ఫోన్ చేసి కుటుంబ స‌భ్యుల‌కు తెలియ‌జేశారు.

కాగా, తాజుద్దీన్ జీవనోపాధి కోసం ప‌దేళ్ల‌ క్రితం సౌదీలోని దమామ్ న‌గరానికి వెళ్లాడు. మొద‌ట కారు డ్రైవర్‌గా పని చేస్తూ జీవ‌నోపాధి పొందిన అత‌డు... ఇటీవలే ఓ వ్యక్తి పేరు మీద లైసెన్స్ తీసుకుని తానే సొంతంగా కూరగాయల దుకాణం పెట్టుకుని నడిపిస్తున్నాడు.

ఈ క్ర‌మంలో తాజుద్దీన్ చ‌నిపోయిన‌ట్లు స్నేహితులు అత‌ని కుటుంబ స‌భ్యుల‌కు తెలిపారు. అయితే, క‌పిల్ (య‌జ‌మాని) అనే వ్యక్తి తాజుద్దీన్‌ను వేధింపుల‌కు గురిచేస్తున్నాడ‌ని, అత‌డే హ‌త్య చేసి ఉండొచ్చ‌ని కుటుంబ స‌భ్యులు ఆరోపించారు. 

తాజుద్దీన్‌ది నిరుపేద కుటుంబం కావ‌డంతో మృత‌దేహాన్ని స్వ‌స్థ‌లం కోదాడ‌కు తీసుకువ‌చ్చేందుకు ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్నారు. దాత‌లు స్పందించి 9182053234 నంబ‌ర్‌కు ఆర్థిక సాయం చేయాల్సిందిగా వారు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. 


More Telugu News