డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌ను తిరంగా ర్యాలీకి రావాల‌ని పురందేశ్వ‌రి పిలుపు

  • ఆప‌రేష‌న్ సిందూర్‌, భారత జ‌వాన్ల‌కు సంఘీభావంగా దేశ‌వ్యాప్తంగా బీజేపీ తిరంగా ర్యాలీ
  • విజ‌య‌వాడ‌లో తిరంగా ర్యాలీ నిర్వ‌హించాల‌ని పురందేశ్వ‌రి నిర్ణ‌యం
  • తిరంగా ర్యాలీలో పాల్గొనాల‌ని కూట‌మి నేత‌ల‌కు పురందేశ్వ‌రి ఆహ్వానం
  • డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌కు ఫోన్ ద్వారా ర్యాలీలో పాల్గొనాల‌ని పిలుపు
ఆప‌రేష‌న్ సిందూర్‌, భారత జ‌వాన్ల‌కు సంఘీభావంగా దేశ‌వ్యాప్తంగా బీజేపీ తిరంగా ర్యాలీని నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. దీంతో విజ‌య‌వాడ‌లోనూ తిరంగా ర్యాలీ నిర్వ‌హించాల‌ని రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షురాలు దగ్గుబాటి పురందేశ్వ‌రి నిర్ణ‌యించారు. రేపు (శుక్ర‌వారం) ఈ ర్యాలీ నిర్వ‌హించ‌నున్నారు. విజ‌య‌వాడ‌లో ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజిస‌ర్కిల్ వ‌ర‌కు ర్యాలీ జ‌ర‌గ‌నుంది.  
 
ఈ క్ర‌మంలో తిరంగా ర్యాలీలో పాల్గొనాల‌ని కూట‌మి నేత‌ల‌ను పురందేశ్వ‌రి ఆహ్వానించారు. ఇందులో భాగంగా  డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఆమె ఫోన్ చేసి, ర్యాలీలో పాల్గొనాల‌ని కోరారు. దీంతో పురందేశ్వ‌రి పిలుపు మేర‌కు జ‌న‌సేనాని ఈ ర్యాలీలో పాల్గొంటాన‌ని చెప్పారు. ఇక‌, ఈ ర్యాలీలో సీఎం చంద్ర‌బాబు కూడా పాల్గొంటార‌ని పురందేశ్వ‌రి వెల్ల‌డించారు. 


More Telugu News