గ్రీస్‌లో భారీ భూకంపం... రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 6.1గా నమోదు

  • ఫ్రై పట్టణానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తింపు
  • ఈ భూకంప ప్ర‌భావంతో ఈజిప్టు, లెబనాన్‌, ఇజ్రాయెల్‌, జోర్డాన్‌లోనూ ప్రకంపనలు
  • భూ అంతర్భాగంలో 78 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందన్న‌ యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే
యూరోపియన్ కంట్రీ గ్రీస్‌లో భారీ భూకంపం సంభ‌వించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైంది. భూ అంతర్భాగంలో 78 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే (USGS) తెలిపింది. ఫ్రై పట్టణానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని వెల్లడించింది. 

ఇక‌, దీని ప్రభావంతో గ్రీస్‌ సమీప దేశాలైన కైరో, ఇజ్రాయెల్, ఈజిప్టు, లెబనాన్‌, తుర్కియే, జోర్డాన్‌లో ప్రకంపన‌లు ప్రకంపనలు సంభవించాయి. గ్రీస్‌ ప్రధాన భూభాగంతో పాటు గ్రీక్‌ ద్వీపాలైన క్రెట్‌, కాసోస్‌, కార్పథోస్‌, డోడకేనెస్‌లో కూడా భూమి కంపించిన‌ట్లు స‌మాచారం. అయితే, ఇప్ప‌టివ‌ర‌కు ఈ భూకంపం వ‌ల్ల‌ జరిగిన నష్టానికి సంబంధించి ఎటువంటి నివేదికలు రాలేదని సంబంధిత‌ అధికారులు వెల్లడించారు. 


More Telugu News