Microsoft: మరోసారి భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైన మైక్రోసాఫ్ట్

Microsoft Announces Another Round of Massive Layoffs
  • మరోసారి భారీగా లేఆఫ్‌లు ప్రకటించనున్న మైక్రోసాఫ్ట్
  • వేలాదిమంది సిబ్బందిపై పడనున్న ప్రభావం
  • మూడు శాతం మందికి లేఆఫ్‌లు ప్రకటించనున్న మైక్రోసాఫ్ట్
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. 2023లో పది వేల మందిని తొలగించిన ఈ సంస్థ, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తమ సిబ్బందిలో మూడు శాతం మందికి లేఆఫ్‌లు ప్రకటించేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

గత ఏడాది జూన్ నాటికి ఈ సంస్థలో 2.28 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. తాజాగా మైక్రోసాఫ్ట్ తీసుకున్న నిర్ణయంతో వేలాది మంది ఉద్యోగులపై ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు అంచనా.

ఈ అంశంపై సంస్థ ప్రతినిధి ఒకరు సీఎన్‌బీసీతో మాట్లాడుతూ.. మార్కెట్లో పైచేయి సాధించేలా ఉత్తమంగా ఉండేందుకు అవసరమైన సంస్థాగత మార్పులను అమలు చేస్తూనే ఉంటామని తెలిపారు. మేనేజ్‌మెంట్ స్థాయిల నుంచి తగ్గించడం, సంస్థ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడమే ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు.

కాగా, ఈ ఏడాది జనవరిలో పనితీరు ఆధారంగా కొంతమందిని సంస్థ తొలగించిన విషయం తెలిసిందే. అయితే తాజా లేఆఫ్‌లకు ఉద్యోగుల పనితీరుకు సంబంధం లేదని సంస్థ స్పష్టం చేసింది. 
Microsoft
Microsoft layoffs
Tech layoffs
Job cuts
Microsoft employees
Layoffs 2024
Global layoffs
Tech industry
Corporate restructuring

More Telugu News