Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి బిగ్ రిలీఫ్.. అయినా బయటకు రావడం కష్టమే!

- కిడ్నాప్ కేసులో వంశీకి ఎస్సీ, ఎస్టీ కోర్టు బెయిల్
- మరో నలుగురికి కూడా ఉపశమనం కలిగించిన కోర్టు
- ప్రస్తుతం ఆరు కేసుల్లో ముద్దాయిగా ఉన్న వంశీ
గన్నవరం టీడీపీ కార్యాలయం ఉద్యోగి సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసిన కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి భారీ ఊరట లభించింది. విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టు వంశీకి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆయనతో పాటు కేసులో నిందితులుగా ఉన్న మరో నలుగురికి కూడా రిలీఫ్ కలిగించింది. ప్రస్తుతం వంశీపై ఆరు కేసులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నారు. కొన్ని కేసుల్లో ఆయనకు స్టేషన్ బెయిల్ లభించింది. ఈ కేసులో ఆయనకు బెయిల్ వచ్చినప్పటికీ బయటకు వచ్చే అవకాశం లేదు. ఇతర కేసుల్లో కూడా బెయిల్ వస్తేనే ఆయన బయటకు వచ్చే అవకాశం ఉంది.