Indian Stock Market Crash: కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్లు

- ప్రాఫిట్ బుకింగ్ కు మొగ్గు చూపిన ఇన్వెస్టర్లు
- 1,281 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
- 346 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణతో నిన్న భారీగా లాభపడిన దేశీయ స్టాక్ మార్కెట్ ఈరోజు కుప్పకూలింది. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడమే దీనికి కారణం. ముఖ్యంగా ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ వంటి బ్లూ చిప్ కంపెనీల షేర్ల అమ్మకాల ఒత్తిడితో సూచీలు పతనమయ్యాయి.
ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,281 పాయింట్లు కోల్పోయి 81,148కి పడిపోయింది. నిఫ్టీ 346 పాయింట్ల నష్టంతో 24,578 వద్ద స్థిరపడింది. అమెరికా డాలర్ తో పోలిస్తే మన రూపాయి మారకం విలువ రూ. 85.33గా ఉంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్
సన్ ఫార్మా (0.84%), అదానీ పోర్ట్స్ (0.48%), బజాజ్ ఫైనాన్స్ (0.29%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.04%), టెక్ మహీంద్రా (0.03%).
టాప్ లూజర్స్
ఇన్ఫోసిస్ (-3.54%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-3.40%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-2.94%), టీసీఎస్ (-2.88%), భారతి ఎయిర్ టెల్ (-2.74%).