India-Pakistan DGMO talks: ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్‌లైన్ సంప్రదింపులు

India Pakistan DGMO Talks Conclude
  • డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) స్థాయి భేటీ
  • హాట్‌లైన్ ద్వారా మాట్లాడుకున్న రాజీవ్ ఘాయ్, కాశిప్ చౌదరి
  • చర్చల్లో ప్రస్తావనకు వచ్చిన అంశాలపై ఉత్కంఠ!
భారత్, పాకిస్తాన్ దేశాల డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓలు) మధ్య నేడు చర్చలు జరిగాయి. హాట్‌లైన్ ద్వారా భారత డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, పాకిస్థాన్ డీజీఎంఓ మేజర్ జనరల్ కాశిప్ చౌదరి సంభాషించారు. సైనిక కార్యకలాపాలకు సంబంధించిన కీలక బాధ్యతలు నిర్వర్తించే ఈ ఉన్నతాధికారుల మధ్య తొలి దశ సంప్రదింపులు సాయంత్రం ముగిశాయి.

వాస్తవానికి మధ్యాహ్నం 12 గంటలకు జరగాల్సిన చర్చలు, సాయంత్రానికి వాయిదా పడ్డాయి. కాల్పుల విరమణ, ఉద్రిక్తతల తగ్గింపు, పీఓకే తదితర అంశాలపై డీజీఎంఓలు చర్చించి ఉంటారని భావిస్తున్నారు.

సాధారణంగా ఇరు దేశాల డీజీఎంఓల మధ్య హాట్‌లైన్ ద్వారా లేదా ఇతర ప్రత్యేక మార్గాల ద్వారా సంప్రదింపులు జరుగుతుంటాయి. సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులు, కాల్పుల విరమణ ఒప్పందాల అమలు, అనుకోని సంఘటనల నివారణ వంటి అంశాలపై ఈ చర్చల్లో ప్రధానంగా దృష్టి సారిస్తారు. ఇరు సైన్యాల మధ్య సమన్వయం, సమాచార మార్పిడికి ఈ వ్యవస్థ అత్యంత కీలకంగా పనిచేస్తుంది.

అయితే, నేటి చర్చల్లో ఏయే అంశాలు ప్రస్తావనకు వచ్చాయి, ఏమైనా కీలక నిర్ణయాలు తీసుకున్నారా అనే వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఇరు దేశాల మధ్య సంబంధాలు, సరిహద్దుల్లో శాంతి స్థాపన దృష్ట్యా డీజీఎంఓ స్థాయి చర్చలకు ఎంతో ప్రాధాన్యత ఉంది.
India-Pakistan DGMO talks
Lieutenant General Rajiv Ghai
Major General Kashif Chaudhry
Indo-Pak relations
Ceasefire violation

More Telugu News