Thammudu Movie: నితిన్ 'తమ్ముడు' నుంచి స్పెషల్ వీడియో విడుదల చేసిన మేకర్స్

- నితిన్, వేణు శ్రీరామ్ కాంబోలో 'తమ్ముడు'
- చాలా గ్యాప్ తర్వాత ఈ చిత్రంలో నటించిన సీనియర్ నటి లయ
- మూవీలో నటించిన ప్రధాన నటీనటులు, వారి పాత్రలను పరిచయం చేస్తూ వీడియో రిలీజ్
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నితిన్ నటించిన తాజా చిత్రం 'తమ్ముడు'. ఈ మూవీ నుంచి స్పెషల్ వీడియోను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. "మూడ్ ఆఫ్ తమ్ముడు. మీ అందరినీ ఆశ్చర్యపరిచే అద్భుతమైన పాత్రలతో నిండిన వైల్డ్ వరల్డ్" అనే క్యాప్షన్‌తో నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ ప్రత్యేక వీడియోను అభిమానులతో పంచుకుంది.
ఈ వీడియో ద్వారా మూవీలో నటించిన ప్రధాన నటీనటులు, వారి పాత్రలను పరిచయం చేశారు. నితిన్, లయ, సప్తమీ గౌడ, శ్వాసికా విజయ్, సౌరభ్ సచ్‌దేవ, వర్ష బొల్లమ్మ పాత్రలను ఇందులో పరిచయం చేశారు మేకర్స్.
ఇక, చాలా గ్యాప్ తర్వాత సీనియర్ నటి లయ మరోసారి ఈ చిత్రం ద్వారా మళ్లీ తెరపై కనిపించనున్నారు. ఆమె హీరో నితిన్ అక్క పాత్రల్లో కనిపించనున్నారు. తమ్ముడు చిత్రాన్ని స్టార్ నిర్మాత దిల్ రాజు భారీ స్థాయిలో నిర్మించారు.
ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందుతున్న ఈ సినిమా ప్రేక్షకులను తప్పక ఆకట్టుకుంటుందని అంటున్నారు. జూలై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు అజనీశ్ లోక్‌నాథ్ బాణీలు అందించారు.