Donald Trump: భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణ: ట్రంప్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఏమందంటే?

India Pakistan Ceasefire Congress Questions Trumps Role
  • తాము మధ్యవర్తిత్వం వహించామన్న డొనాల్డ్ ట్రంప్
  • ఆమెరికా ప్రమేయం ఉందా అనేది చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్
  • పరిస్థితిని అంచనా వేయడానికి పార్లమెంట్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్
భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా ప్రమేయం ఉందా అని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రశ్నించింది. ఉభయ దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి తాము మధ్యవర్తిత్వం వహించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందిస్తూ, యుద్ధ వాతావరణం తగ్గడంలో అమెరికా ప్రమేయం ఉందా అని చెప్పాలని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ డిమాండ్ చేశారు.

మన దేశ విదేశీ విధానంలో ఏవైనా మార్పులు చోటు చేసుకున్నాయా అనేది కూడా చెప్పాలని అన్నారు. భారత్-పాకిస్థాన్ మధ్య ఉన్న కశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వానికి మూడో పక్షాన్ని అనుమతించడం ద్వారా సిమ్లా ఒప్పందాన్ని ఉల్లంఘించారా అని నిలదీశారు. తమ జోక్యం ఉందంటూ ట్రంప్ చేస్తున్న ప్రకటనలపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.

ఈ అంశాలపై చర్చించేందుకు పార్లమెంటును అత్యవసరంగా సమావేశపరచాలని అన్నారు. పరిస్థితిని అంచనా వేయడానికే తప్ప, తాము ఎవరినీ నిందించడానికి అత్యవసర సమావేశం కోరడం లేదని స్పష్టం చేశారు. ఏమైనా తప్పులు జరిగి ఉంటే భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
Donald Trump
India-Pakistan ceasefire
Kashmir issue
US mediation
K.C. Venugopal
India-Pakistan relations

More Telugu News