భారత్ దాడుల్లో మా యుద్ధ విమానం ధ్వంసం కావడం నిజమే.. పాక్ అంగీకారం
- నష్టం స్వల్ప నష్టమేనని పాక్ ఆర్మీ వెల్లడి
- ఆర్మీ ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌధరీ ప్రకటన
- పాక్ విమానాలను కూల్చామని గతంలో భారత సైన్యం వెల్లడి
- నష్టం వివరాలను పూర్తిస్థాయిలో బయటపెట్టని పాక్
భారత సైన్యం ప్రకటన
‘ఆపరేషన్ సిందూర్’లో భారత సైన్యం సాధించిన విజయాలను ఎయిర్ మార్షల్ ఏకే భారతి ఆదివారం మీడియాకు వివరించారు. ఈ ఆపరేషన్‌లో పాకిస్థాన్ విమానాలను నేలకూల్చామని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఎన్ని విమానాలను కూల్చివేశారన్న సంఖ్యను ఆయన వెల్లడించలేదు. "మన దేశ సరిహద్దుల్లోకి పాకిస్థానీ యుద్ధ విమానాలు ప్రవేశించకుండా సమర్థవంతంగా అడ్డుకున్నాం. అందువల్ల వాటి శకలాలు మన వద్ద లేవు. అయినప్పటికీ, కచ్చితంగా కొన్ని శత్రు విమానాలను కూల్చివేశాం" అని భారతి పేర్కొన్నారు. భారత సైనిక సామర్థ్యాన్ని తాము చాటిచెప్పామని, ఈ ఘర్షణల ప్రభావం రావల్పిండి వరకు చేరిందని భారత వర్గాలు పేర్కొన్నాయి.