Salman Khan: థాంక్యూ డాడ్... నాకు అత్యుత్తమ తల్లులను ఇచ్చావు: సల్మాన్ ఖాన్ 'మదర్స్ డే' పోస్ట్

- నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- తన తల్లి సల్మా ఖాన్, తన తండ్రి రెండో భార్య హెలెన్ ను ఉద్దేశించి సల్మాన్ విషెస్
- ఇద్దరినీ తల్లులుగా పేర్కొన్న బాలీవుడ్ స్టార్
ఇవాళ అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా, బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్ ఖాన్ ప్రత్యేకంగా స్పందించారు. తన తండ్రి సలీం ఖాన్ కు ఆయన కృతజ్ఞతలు చెప్పడం విశేషం.
"నాకు ప్రపంచంలోనే అత్యుత్తమమైన తల్లులను అందించినందుకు నాన్నకు ధన్యవాదాలు" అంటూ సల్మాన్ ఖాన్ పేర్కొన్నారు. "నా ప్రపంచంలోని అత్యంత అందమైన మహిళలకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు" అని పేర్కొన్నారు. సల్మాన్ ఖాన్ తన తల్లి సల్మా ఖాన్‌తో పాటు, తన తండ్రి రెండో భార్య, ప్రముఖ నటి హెలెన్‌ను కూడా తల్లిగా భావిస్తూ ఆప్యాయత చూపుతారన్న విషయం తెలిసిందే. ఈ మేరకు సల్మాన్ వారిద్దరితో కలిసి ఉన్న ఫొటోను కూడా పంచుకున్నారు.
ప్రతి ఏటా మాతృ దినోత్సవం నాడు తన తల్లులపై ప్రేమను కురిపించే సల్మాన్ ఖాన్, ఈసారి కూడా అదే తరహాలో తన భావాలను పంచుకోవడం ఆయన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.