Indian Oil Corporation Limited: దేశంలో ఇంధన కొరత అంటూ మరో ఫేక్ ప్రచారం

Fuel Shortage in India Another Fake News Debunked
––
భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతల వేళ సోషల్ మీడియాలో పలు ఫేక్ న్యూస్ వైరల్ గా మారుతున్నాయి. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించే ఈ పోస్టులపై ప్రభుత్వం, సంబంధిత సంస్థలు ఎప్పటకప్పుడు స్పందిస్తూ వాస్తవాలు వెల్లడిస్తున్నాయి. పొరుగు దేశంతో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో దేశంలో ఇంధన కొరత ఏర్పడిందంటూ తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దేశవ్యాప్తంగా చమురు నిల్వల్లో కొరత ఏర్పడిందని, పెట్రోల్ డీజిల్ నిల్వలు తక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.

అయితే, ఈ వార్తల్లో వాస్తవం లేదని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ స్పష్టం చేసింది. తమ వద్ద సరిపడా నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. ‘‘దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పెట్రోల్ బంకుల్లోనూ ఆయిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి. ఆయిల్ సరఫరా వ్యవస్థ సజావుగా పనిచేస్తోంది. ఇంధనం విషయంలో ఎవరికీ ఎలాంటి ఆందోళన ఆందోళన అక్కర్లేదు. పెట్రోల్, డీజిల్ కోసం బంకుల వద్ద క్యూ కట్టాల్సిన పనిలేదు. బంకుల వద్ద అనవసర రద్దీని నివారించి, మెరుగైన సేవలు అందించేందుకు మాకు సహకరించండి’’ అంటూ ఇండియన్ ఆయిల్ ఓ ప్రకటన విడుదల చేసింది.
Indian Oil Corporation Limited
Fuel Shortage
Fake News
India-Pakistan Tension
Social Media Hoax
Petrol
Diesel
Oil Reserves
Fuel Supply
India

More Telugu News