Vikram Doraiswami: పాక్ ఉగ్రవాదానికి ఆధారాలివిగో.. భారత హైకమిషనర్ దొరైస్వామి
- కీలక ఆధారాలు బయటపెట్టిన భారత్
- ఉగ్రవాదులకు పాక్ సైన్యం అంత్యక్రియలు.. శవపేటికలపై పాక్ పతాకం
- అమెరికా నిషేధిత ఉగ్రవాది హఫీజ్ అబ్దుర్ రవూఫ్‌తో పాక్ సైనికాధికారులు ఉన్న ఫోటో విడుదల
పాకిస్థాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోందనడానికి తమ వద్ద తిరుగులేని ఆధారాలు ఉన్నాయని యునైటెడ్ కింగ్‌డమ్‌లోని భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి స్పష్టం చేశారు. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక విషయాలు వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత్ మట్టుబెట్టిన ఉగ్రవాదులకు పాక్ సైన్యం దగ్గరుండి అంత్యక్రియలు చేసిందని ఆయన పేర్కొన్నారు. అమెరికా నిషేధిత ఉగ్రవాది, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ సోదరుడు హఫీజ్ అబ్దుర్ రవూఫ్‌తో పాకిస్థానీ ఉన్నత సైనికాధికారులు కలిసి ఉన్న ఫోటోను దొరైస్వామి ప్రదర్శించారు. ఆ ఫోటోలో రవూఫ్ వెనుక పాక్ సైనికాధికారులు యూనిఫాంలో ఉండటం, ఉగ్రవాదుల శవపేటికలపై పాకిస్థాన్ జాతీయ పతాకాలు కప్పి ఉండటం స్పష్టంగా కనిపిస్తోంది.
మీడియా సంస్థతో దొరైస్వామి మాట్లాడుతూ.. "ఈ ఫోటో చూడండి. ఇతను హఫీజ్ అబ్దుర్ రవూఫ్, అమెరికా నిషేధిత ఉగ్రవాది. అతని వెనుక ఉన్నది పాకిస్థాన్ సైన్యం. శవపేటికలపై పాకిస్థాన్ జాతీయ జెండాలున్నాయి. ఉగ్రవాదులకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తుంటే, మీ వ్యవస్థ గురించి ఏమనుకోవాలి?" అని దొరైస్వామి ప్రశ్నించారు. పాకిస్థాన్ ప్రభుత్వం, సైన్యం ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడమే కాకుండా అధికారికంగా మద్దతు ఇస్తోందని భారత్ దశాబ్దాలుగా చేస్తున్న ఆరోపణలకు ఈ ఫోటో ప్రత్యక్ష నిదర్శనమని దొరైస్వామి తెలిపారు.