Samantha: సమంత ఎంచుకున్న కథపై టాక్ ఎలా ఉందంటే ..?

Shubham Movie Update
  • ఈ రోజు విడుదలైన 'శుభం'
  • నిర్మాతగా సమంత తొలి ప్రయత్నం 
  • హారర్ కామెడీ జోనర్లో సాగే కథాకథనాలు 
  • సరదాగా ఓ సారి చూడొచ్చని అంటున్న ఆడియన్స్       

సమంత .. ఒకే సమయంలో తెలుగు - తమిళ భాషలలో చక్రం తిప్పేసిన స్టార్ హీరోయిన్. నాయిక ప్రధానమైన కథలలోను తానేమిటనేది ఆమె నిరూపించుకున్నారు. ఎంతటి బలమైన పాత్రనైనా చాలా తేలికగా చేయగలదనే అభిమానుల నమ్మకాన్ని సంపాదించుకున్నారు. అలాంటి సమంత తనకి తగిన కథలను ఎంచుకుంటూనే, మరో వైపున నిర్మాతగా మారిపోయారు. ఆమె సొంత బ్యానర్ నుంచి వచ్చిన మొదటి సినిమానే 'శుభం'. 

ఈ రోజునే థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. హర్షిత్ రెడ్డి .. గవిరెడ్డి శ్రీనివాస్ .. చరణ్ పెరి .. శ్రియ కొంతం .. శర్వాణి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించాడు. కేబుల్ టీవీలతో కాలక్షేపం చేస్తున్న గ్రామాలు, అప్పుడప్పుడే డీటీహెచ్ లకు అలవాటు పడుతున్న రోజులలో ఈ కథ నడుస్తుంది. కొత్తగా పెళ్లయిన కొంతమంది యువతులు, టీవీలో ఒక సీరియల్ వచ్చే సమయంలో వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు. అందుకు కారణం ఏమిటనేది తెలుసుకోవడానికి వారి భర్తలు రంగంలోకి దిగడమే కథ. 

హారర్ కామెడీ జోనర్ నుంచి వచ్చిన కథ ఇది. గెస్టు పాత్రలో సమంత తళుక్కున మెరిసిన కంటెంట్ ఇది. సమంత సొంత బ్యానర్ నుంచి ఎంటువంటి సినిమా వస్తుందా అనే అభిమానుల ఆలోచన కారణంగా థియేటర్ల దగ్గర కాస్త సందడి కనిపిస్తోంది. కామెడీ పాళ్లు బాగానే కలిపారుగానీ, హారర్ పాళ్లు తగ్గాయనే టాక్ వినిపిస్తోంది. కాన్సెప్ట్ బాగుందనీ, కాకపోతే సరైన ట్రీట్మెంట్ తోడై ఉంటే నెక్స్ట్ లెవెల్ కి వెళ్లేదని అంటున్నారు. ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు లేని ఈ సినిమాను, ఫ్యామిలీతో కలిసి సరదాగా చూసేయవచ్చని చెబుతున్నారు.

Samantha
Shubham Movie
Telugu Horror Comedy
Samantha's Production
Praveen Kandregula
Harshit Reddy
Gavi Reddy Srinivas
Shriya Kontham
Sharvani
Tollywood

More Telugu News