Rajnath Singh: త్రివిధ ద‌ళాధిప‌తులు, సీడీఎస్‌తో రాజ్‌నాథ్ సింగ్ భేటీ

Rajnath Singh Meets Tri services Chiefs Amidst India Pakistan Tensions
  • ఈరోజు ఉద‌యం ఢిల్లీలో త్రివిధ ద‌ళాధిప‌తులు, సీడీఎస్‌తో ర‌క్ష‌ణ‌మంత్రి స‌మావేశం
  • నిన్న రాత్రి స‌రిహ‌ద్దు రాష్ట్రాల్లో పాక్ దాడుల‌ను తిప్పికొట్టిన భార‌త బ‌ల‌గాలు 
  • భార‌త సైన్యం దాయాది దాడుల‌ను తిప్పికొట్టిన కొన్ని గంట‌ల్లోనే ఈ భేటీ
ర‌క్ష‌ణ‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈరోజు ఉద‌యం త్రివిధ ద‌ళాధిప‌తులు, సీడీఎస్‌తో స‌మావేశ‌మ‌య్యారు. గురువారం రాత్రి స‌రిహ‌ద్దు రాష్ట్రాల్లో దాయాది పాక్ దాడుల‌ను భార‌త బ‌ల‌గాలు తిప్పికొట్టిన నేప‌థ్యంలో న్యూఢిల్లీ ఈ ఉద‌యం ఈ కీల‌క భేటీ మొద‌లైంది. రాజ‌స్థాన్‌, గుజ‌రాత్‌పై పాకిస్థాన్ డ్రోన్లు, మిస్సైల్ దాడుల‌ను భార‌త సైన్యం తిప్పికొట్టిన కొన్ని గంట‌ల్లోనే ఈ స‌మావేశం జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం.

ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడికి ప్ర‌తీకారంగా భార‌త సైన్యం ఆప‌రేష‌న్ సిందూర్ నిర్వ‌హించింది. ఈ ఆప‌రేష‌న్‌ ద్వారా పీఓకే, పాకిస్థాన్‌ల‌లో ఉగ్ర‌వాద స్థావరాల‌పై క్షిప‌ణి దాడులు నిర్వ‌హించింది. తొమ్మిది ప్రాంతాల్లో భార‌త బ‌ల‌గాలు చేప‌ట్టిన ఈ దాడుల్లో సుమారు 100 మంది వ‌ర‌కు ఉగ్ర‌వాదులు మృతిచెందారు. ప్ర‌స్తుతం ఈ ఆప‌రేష‌న్ కొన‌సాగుతున్న‌ట్లు గురువారం అఖిల ప‌క్ష స‌మావేశంలో ర‌క్ష‌ణ‌మంత్రి వెల్ల‌డించారు. 

కాగా, దాయాది పాక్ స‌రిహద్దు వెంబ‌డి వ‌క్ర‌బుద్ధితో భార‌త్‌పై దాడుల‌కు తెగ‌బ‌డుతోంది. నిన్న పాక్ ద‌ళాలు ప‌ఠాన్ కోట్‌, ఉధంపూర్‌, జ‌మ్మూలోని భార‌త సైనిక స్థావ‌రాల‌పై దాడికి తీవ్రంగా ప్ర‌య‌త్నించాయి. కానీ, భార‌త బ‌ల‌గాలు వీటిని స‌మ‌ర్థ‌వంతంగా తిప్పికొట్టాయి. దీంతో పాటు ఎల్ఓసీ స‌మీపంలోని పాక్ ఆర్మీ పోస్టుల‌ను భార‌త సైన్యం ధ్వంసం చేసింది.
Rajnath Singh
CDS
Tri-services Chiefs
India-Pakistan Border
Operation Sindoor
Pakistan Drone Attacks
Cross-border Firing
Anti-terror Operation
Military Meeting
National Security

More Telugu News