Mulugu: ములుగులో మందుపాతర పేలుడు.. ముగ్గురు పోలీసుల మృతి!

Three Police Officers Killed in Mulugu Landmine Blast
  • ములుగు జిల్లా వాజేడులో మందుపాతర పేలుడు ఘటన
  • మావోయిస్టుల కోసం కూంబింగ్‌ చేస్తుండగా దుర్ఘటన
  • కర్రెగుట్టల ఎన్‌కౌంటర్ నేపథ్యంలో అడవుల్లో గాలింపు
ములుగు జిల్లాలో మావోయిస్టులు అమర్చినట్లు భావిస్తున్న మందుపాతర పేలిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు పోలీసులు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు ధృవీకరించాల్సి ఉంది.

వాజేడు మండల పరిధిలోని వెంకటాపురం మండల సరిహద్దుల్లో గల అటవీ ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. నిషేధిత మావోయిస్టు పార్టీ కార్యకలాపాల నేపథ్యంలో పోలీసులు ఆ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలిందని సమాచారం.

ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన కర్రెగుట్టల్లో నిన్న భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భారీస్థాయిలో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఆపరేషన్‌లో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ భారీ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో, మావోయిస్టుల కదలికలు పెరిగే అవకాశం ఉందని భావించిన పోలీసులు, సరిహద్దు ప్రాంతాలతో పాటు ములుగు జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. వెంకటాపురం పరిసర అటవీ ప్రాంతంలో చేపట్టిన ఈ కూంబింగ్ ఆపరేషన్ సందర్భంగానే ఈ మందుపాతర పేలుడు సంభవించింది.
Mulugu
Telangana Police
Maoist Attack
Landmine Blast
Police Deaths
naxalites
bomb blast
Combating Operation
Venkatapuram
Forest Area

More Telugu News