Tamannaah Bhatia: ఓటీటీలోకి వచ్చేస్తున్న తమన్నా కొత్త చిత్రం .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

- తమన్నా తాజా చిత్రం ఓదెల 2
- అమెజాన్ ప్రైమ్ వీడియోలో గురువారం (నేడు) నుంచి స్ట్రీమింగ్ కానున్న ఓదెల 2
- ఏప్రిల్ లో బాక్సాఫీసు ముందుకొచ్చిన ఓదెల 2
తమన్నా ప్రధాన పాత్రలో నటించిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ ‘ఓదెల 2’ ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ఏప్రిల్‌లో బాక్సాఫీసు ముందుకొచ్చిన ఈ చిత్రం ఓటీటీ వేదిక 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో గురువారం నుంచి స్ట్రీమింగ్ కానుంది.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉండనుంది. 'ఓదెల రైల్వే స్టేషన్'కు సీక్వెల్‌గా దర్శకుడు అశోక్ తేజ ఈ మూవీని తెరకెక్కించారు. సంపత్ నంది ఈ చిత్రానికి కథ అందించారు.
ఓదెల అనే గ్రామంలో జరిగే కథ ఇది. గ్రామంలో భార్య రాథ (హెబ్బా పటేల్) చేతిలో హత్యకు గురైన తిరుపతి (వశిష్ఠ ఎన్ సింహా) ఆత్మ, ప్రేతాత్మగా మారి ఊరి ప్రజలపై పగ తీర్చుకోవడం మొదలు పెడుతుంది. గ్రామంలో తిరుపతి ప్రేతాత్మ నవ వధువులను అత్యాచారం చేసి చంపేస్తుంది. దీంతో తిరుపతి భయంకర దుష్టశక్తిగా మారాడని ఓదెల గ్రామస్తులకు తెలుస్తుంది. తిరుపతి ప్రేతాత్మ ఓదెలలో ఇంకెన్ని ప్రాణాలు బలి తీసుకుంది? ఓదెలను కాపాడటానికి వచ్చిన నాగ సాధువు బైరవి (తమన్నా)కి, తిరుపతి ప్రేతాత్మకు మధ్య ఎలాంటి పోరు నడుస్తుంది అనేది ఈ సినిమా కథ.