Narendra Modi: ఆపరేషన్ సిందూర్... ప్రధాని మోదీ నార్వే, క్రొయేషియా, నెదర్లాండ్స్ పర్యటన వాయిదా

Operation Sindhu Modi Postpones Foreign Trip After Surgical Strikes
  • ఆపరేషన్ సిందూర్ పేరిట పాక్ కు గట్టి హెచ్చరిక జారీ చేసిన భారత్
  • తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు, శిబిరాలను ధ్వంసం చేసిన భారత సైన్యం
  • కేంద్ర కేబినెట్ తో కీలక సమావేశం నిర్వహిస్తున్న మోదీ
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ కు ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత సైన్యం గట్టి సమాధానం ఇచ్చింది. ఈ తెల్లవారుజామున పాకిస్థాన్ ప్రధాన భూభాగంతో పాటు పీఓకేలో ఉన్న తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు, శిబిరాలను క్షిపణులతో ధ్వంసం చేసింది. ఇప్పటి వరకు భారత్ దాడులకు పాకిస్థాన్ వైపు నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదు. 

మరోవైపు, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ప్రధాని మోదీ తన మూడు దేశాల పర్యటనను వాయిదా వేసుకున్నారు. నార్వే, క్రొయేషియా, నెదర్లాండ్స్ లో ప్రధాని పర్యటించాల్సి ఉంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఆయన తన విదేశీ పర్యటనలను వాయిదా వేసుకున్నారు. ఈ పర్యటనలు మళ్లీ ఎప్పుడు జరుగుతాయనే విషయం ఇంకా వెల్లడి కాలేదు. మరోవైపు కేంద్ర కేబినెట్ తో మోదీ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ భేటీ అనంతరం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆపరేషన్ సిందూర్ పై ప్రకటన వెలువడనుంది.
Narendra Modi
Operation Sindhu
Pakistan
Surgical Strike
India
Norway
Croatia
Netherlands
Foreign Trip
Postponed

More Telugu News