Kushboo: ఈమె ఎవరో అనుకునేరు... కుష్బూనే!

Kushboos Stunning Slim Look Goes Viral on X
 
ఒకప్పటి అందాల నటి, ప్రస్తుత బీజేపీ నేత కుష్బూ సోషల్ మీడియాలో మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఇటీవల ఆమె ఎక్స్ అకౌంట్ ను హ్యాక్ చేయగా, కొన్నాళ్ల పాటు సామాజిక మాధ్యమానికి దూరం అయ్యారు. ఇటీవల ఆ అకౌంట్ ను పునరుద్ధరించడంతో కుష్బూ మళ్లీ అభిమానులకు అందుబాటులోకి వచ్చారు. తాజాగా, తన అల్ట్రా స్లిమ్ లుక్ తో ఉన్న కొన్ని ఫొటోలను ఆమె ఎక్స్ లో పంచుకున్నారు. 

ఆమె పంచుకున్న ఫొటోలు కాబట్టి అందులో ఉన్నది కుష్బూ అని గుర్తించగలం కానీ... మామూలుగా అయితే ఆమె ఎవరో అనుకునే అవకాశం ఉంది. అంత గుర్తుపట్టలేనంత స్లిమ్ గా మారిపోయింది. 'గోల్డెన్ గ్లో' పేరిట కుష్బూ ఈ ఫొటోలను పంచుకుంది. 

అయితే, ఈ ఫొటోలపై ఓ నెటిజన్ వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడు. బాధ్యతాయుతమైన స్థాయిలో ఉండి ఇలాంటి ఫొటోలు పెట్టడం సిగ్గుచేటు అని పేర్కొన్నాడు. అందుకు కుష్బూ బదులిస్తూ... ఇందులో మీరు ఏం సిగ్గులేనితనాన్ని గుర్తించారు? చూస్తుంటే మీ మనస్తత్వమే సిగ్గుమాలినతనంతో కూడుకున్నదిగా కనిపిస్తోంది సర్ అంటూ స్పందించారు. 

ఇక, చాలామంది నెటిజన్లు కుష్బూ తాజా ఫొటోల పట్ల అభినందనలు తెలిపారు.
Kushboo
Kushboo Sundar
BJP Leader
Actress
Social Media
X Account
Slim Look
Photos
Viral Photos
Netizen Comments

More Telugu News