K. Sreeisha: పెళ్లైన సంతోషం కూడా లేకుండా నన్ను బాధపెడుతున్నారు: బర్రెలక్క

Barrelakkas Emotional Plea Against Social Media Trolls
  • సోషల్ మీడియా ట్రోల్స్‌పై బర్రెలక్క తీవ్ర ఆవేదన
  • ముఖ్యంగా తన పెళ్లి గురించి ట్రోల్స్ చేస్తున్నారని కంటతడి
  • ట్రోల్స్ భయంతోనే త్వరగా పెళ్లి చేసుకున్నానని వెల్లడి
తెలుగు రాష్ట్రాల్లో బర్రెలక్కగా పరిచయమైన కర్నె శిరీష మరోసారి వార్తల్లో నిలిచారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్‌కర్నూలు జిల్లా కొల్హాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి అందరి దృష్టిని ఆకర్షించిన ఆమె, తాజాగా తనపై వస్తున్న సోషల్ మీడియా ట్రోల్స్‌పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె విడుదల చేసిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసినప్పటి నుంచి తనపై నిరంతరంగా ట్రోల్స్ వస్తున్నాయని శిరీష వాపోయారు. ఇటీవల జరిగిన తన వివాహం గురించి కూడా అసభ్యకరంగా ట్రోల్స్ చేస్తున్నారని కన్నీటిపర్యంతమయ్యారు. "నేను చేసిన తప్పేంటి? నన్ను ఎందుకు ఇంతలా వేధిస్తున్నారు?" అంటూ వీడియోలో ఆమె ప్రశ్నించారు. తనకు ముఖపరిచయం లేని వ్యక్తులు కూడా తన స్నేహితులమని చెప్పుకుని మోసాలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

"ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉంటే అందరూ ఇలాగే ట్రోల్స్ చేసి నా జీవితాన్ని నాశనం చేస్తారని నేను పెళ్లి చేసుకున్నాను. నిజానికి, పెళ్లి చేసుకోవాలని నాకు ఆసక్తి లేదు. ఒక సంవత్సరం ఆగుదాం అనుకున్నాం. కానీ, ఇంకా ఎన్ని రకాలుగా నిందిస్తారో అని భయపడి పెళ్లి చేసుకున్నాం. ఈ రోజు వరకు కూడా పెళ్లైన సంతోషం లేకుండా ట్రోల్స్ చేసి మానసికంగా నన్ను చాలా బాధపెడుతున్నారు. అన్నీ దేవుడు చూస్తూనే ఉంటాడు. నేను ఎవ్వరినీ ఏమీ అనను. కర్మ ఎవ్వరినీ వదిలి పెట్టదు" అని శిరీష వాపోయారు.
K. Sreeisha
Barrelakka
Social Media Trolls
Telangana Elections
Independent Candidate
Kolhapur Constituency
Marriage
Cyberbullying
Emotional Distress
Viral Video

More Telugu News