గచ్చిబౌలిలో హైడ్రా బుల్డోజర్లు.. అక్రమ కట్టడాల కూల్చివేతలు
- సంధ్య కన్వెన్షన్ లోని మినీ హాల్ కూల్చివేత
- ఉదయాన్నే మూడు భారీ బుల్డోజర్లతో గచ్చిబౌలికి అధికారులు
- పోలీస్ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు నేలమట్టం
ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయిస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్ పరిధిలో కూల్చివేతలు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకున్నా ఈ లేఅవుట్ లో రోడ్లు, పార్కులు, స్థలాలను ఆక్రమించి భవనాలు నిర్మించినట్లు పేర్కొన్నారు. తాజాగా ఈ అక్రమ నిర్మాణాల తొలగింపును చేపట్టినట్లు వివరించారు. సంధ్య కన్వెన్షన్ లో అక్రమంగా నిర్మించిన వంటగదులు, రెస్ట్ రూములు, మినీ హాల్ వంటి నిర్మాణాలను నేలమట్టం చేసినట్లు తెలిపారు.