Karimnagar: కరీంనగర్ సహా పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు... ఉలిక్కిపడ్డ జనం

Karimnagar Earthquake Minor tremors shake several districts in Telangana
  • తెలంగాణలోని పలు ఉత్తర జిల్లాల్లో భూప్రకంపనలు
  • కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, నిర్మల్, పెద్దపల్లిలో ప్రభావం
  • కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో జనం ఆందోళన
  • భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన స్థానికులు
తెలంగాణ ఉత్తర ప్రాంతంలోని జిల్లాల్లో స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో మంగళవారం భూమి కంపించింది. ఈ పరిణామంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లలోని వస్తువులు కదలడం, భూమి కొద్ది సెకన్ల పాటు కంపించడంతో ఏం జరుగుతుందో తెలియక భయంతో బయటకు పరుగులు తీశారు.

కరీంనగర్‌లో తీవ్రత

ముఖ్యంగా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రకంపనల ప్రభావం ఎక్కువగా కనిపించింది. జిల్లాలోని చొప్పదండి, గంగాధర, రామడుగు మండలాల్లో భూమి కొన్ని క్షణాల పాటు తీవ్రంగా కంపించినట్లు స్థానికులు తెలిపారు. ఇళ్లు, భవనాలు కూడా కంపించాయని వారు చెప్పారు. కొందరు స్థానికులు రెండు సార్లు భూమి తీవ్రంగా కంపించిందని పేర్కొన్నారు. నిర్మల్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భూప్రకంపనలు చోటు చేసుకున్నాయని సమాచారం. భూమి కంపించడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు.
Karimnagar
Telangana
earthquake
minor earthquake
tremors
Rajanna Siricilla
Jagtial
Vemulawada
Nirmal
Peddapalli
earthquake tremors Telangana
Telangana earthquake news

More Telugu News