Balakrishna: బంగారంతో చేసిన వాసవీమాత విగ్రహాన్ని ఆవిష్కరించిన బాలకృష్ణ

Balakrishna Unveils Gold Vasavi Matha Statue
  • హిందూపురం శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో వార్షికోత్సవాలు
  • రెండున్న కేజీల బంగారంతో తయారు చేసిన అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠాపన
  • బంగారు పుష్పాలతో ప్రత్యేక పూజలు చేసిన బాలకృష్ణ
హిందూపురంలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ చేసి 85 ఏళ్లు గడిచిన సందర్ఘంగా వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. రెండున్నర కేజీల బంగారంతో, సుమారు రూ. 3 కోట్లు వెచ్చించి తయారు చేసిన వాసవీమాత విగ్రహాన్ని ఆలయంలో ఏర్పాటు చేశారు. 

ఈ విగ్రహాన్ని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ దంపతులు ఆవిష్కరించారు. బంగారు పుష్పాలతో అమ్మవారికి బాలయ్య ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమం అనంతరం బాలకృష్ణ దంపతులను ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఘనంగా సత్కరించారు. మరోవైపు, అమ్మవారి బంగారు విగ్రహాన్ని దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు.
Balakrishna
Hindupur
Kanaka Parameswari Temple
Gold Statue
Vasavi Matha
Temple Festival
Andhra Pradesh
Balayya
Religious Ceremony

More Telugu News