గాళ్‌ఫ్రెండ్‌తో కలిసి నూడుల్స్ తింటుండగా కొడుకును పట్టుకున్న తల్లిదండ్రులు.. నడిరోడ్డుపై విచక్షణ రహితంగా దాడి.. వీడియో ఇదిగో!
- ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూరులో ఘటన
- యువకుడి ప్రేమ వ్యవహారం నచ్చకపోవడమే కారణం
- చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న పోలీసులు
వైరల్ అయిన వీడియోలో రోహిత్ తల్లి సుశీల యువ జంటను తీవ్రంగా కొడుతున్న దృశ్యాలు కనిపించాయి. వారు టూవీలర్‌పై తప్పించుకునే ప్రయత్నం చేయగా సుశీల యువతి జుట్టు పట్టుకుని లాగడం వీడియోలో రికార్డయింది. అక్కడున్న స్థానికులు, బాటసారులు వారిని విడదీసేందుకు ప్రయత్నించారు. మరోవైపు, రోహిత్ తండ్రి శివ్‌కరణ్ తన కొడుకును చెప్పుతో కొట్టడం కూడా కనిపించింది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఇరు పక్షాలను పోలీస్ స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం వారిని విడిచిపెట్టారు. ఈ ఘటనలో ఇరు పక్షాలకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. నడిరోడ్డుపై జరిగిన ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.