'నువ్వు నిజంగా సింహానివి'.. కోహ్లీపై హీరో శింబు కామెంట్‌!

  • ప్ర‌స్తుతం కోహ్లీ రిపీటెడ్‌గా వింటున్న ఓ తమిళ్ సాంగ్ 
  • శింబు హీరోగా న‌టించిన 'పాథా థాలా' మూవీలోని ఆ పాట కోహ్లీ ఫేవరెట్ 
  • ఈ చిత్రంలోని 'నీ సింగం ధాన్' అనే పాట ప్ర‌స్తుతం త‌న‌ మోస్ట్ ఫేవరెట్ సాంగ్ అన్న కోహ్లీ
  • కోహ్లీ ఇంట‌ర్వ్యూ తాలూకు వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన ఆర్‌సీబీ
  • ఆ పోస్టును రీ షేర్ చేసిన హీరో శింబు.. విరాట్‌పై ప్ర‌శంస‌లు    
ఎప్పుడూ ఫుల్ ఎన‌ర్జీతో క‌నిపించే టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ... బోర్ కొట్టినప్పుడు ఎక్కువగా పాట‌లు వింటూ చిల్ అవుతూ ఉంటాడు. ప్రాక్టీస్ లేని సమయంలో హెడ్ ఫోన్స్, బ్లూటూత్‌లో సాంగ్స్ వింటుంటాడు. అయితే, ఢిల్లీకి చెందిన కోహ్లీకి ఇష్టమైన సాంగ్స్ అంటే దాదాపు అందరూ బాలీవుడ్ పాట‌లే అనుకుంటారు. కానీ, ర‌న్ మెషీన్‌కి ద‌క్షిణాది పాట‌లంటే ఇష్టమని తెలిసింది. ప్ర‌స్తుతం తాను లూప్‌లో రిపీటెడ్‌గా వింటున్న‌ ఓ తమిళ్ సాంగ్ తన ఫేవరెట్ అంటూ లైవ్‌లో పాట ప్లే చేసి మ‌రీ చూపించాడు.

అది కూడా శింబు హీరోగా న‌టించిన పాథా థాలా సినిమాలోని ఓ పాట కోహ్లీ ఫేవరెట్ సాంగ్ కావ‌డం విశేషం. ఇటీవల ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో అత‌నే నేరుగా ఈ విషయం చెప్పాడు. ప్రస్తుతానికి తన ఫేవరెట్ సాంగ్ ఏంటి అని అడగ్గానే మొబైల్ తీసి మరీ పాట‌ ప్లే చేసి వినిపించాడు. ఈ మూవీలోని 'నీ సింగం ధాన్' అనే పాట ప్ర‌స్తుతం త‌న‌ మోస్ట్ ఫేవరెట్ సాంగ్ అని చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను ఆర్‌సీబీ త‌న అధికారిక సోష‌ల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. దాంతో ఆ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ గా మారింది. 

తాజాగా హీరో శింబు ఆ పోస్టును రీ షేర్ చేశారు. కోహ్లీని ఉద్దేశించి "నువ్వు నిజంగా సింహానివి" అనే క్యాప్ష‌న్‌తో శింబు చేసిన పోస్టు ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. దీనిపై ర‌న్ మెషీన్ అభిమానులు త‌మ‌దైన‌శైలిలో స్పందిస్తున్నారు. 

ఇక‌, ఎప్ప‌ట్నుంచో విరాట్ కోహ్లీ బ‌యోపిక్ గురించి బాగా చ‌ర్చ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఇందులో ఈ స్టార్ క్రికెట‌ర్ పాత్ర‌లో శింబు న‌టించ‌నున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. తాజాగా ఈ హీరో అచ్చం కోహ్లీలానే గ‌డ్డం పెంచ‌డంతో ఆ వార్త‌ల‌కు ఊతం ఇచ్చిన‌ట్లైంది. కాగా, విరాట్ బ‌యోపిక్‌లో న‌టించాల‌ని ఉందంటూ ఇప్ప‌టికే బాలీవుడ్ హీరో ర‌ణ్‌బీర్ క‌పూర్ త‌న మన‌సులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టిన విష‌యం తెలిసిందే. 

ఇదిలాఉంటే... ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఐపీఎల్ 18వ సీజ‌న్ లో కోహ్లీ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకుంటున్న సంగ‌తి తెలిసిందే. వ‌రుస హాఫ్ సెంచ‌రీల‌తో ర‌న్ మెషీన్ స‌త్తా చాటుతున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు 10 మ్యాచులాడి 443 ప‌రుగులు చేశాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో ఐదో స్థానంలో ఉన్నాడు.  




More Telugu News