Sunrisers Hyderabad: కాస్త గ్యాప్ తర్వాత సన్ రైజర్స్ మ్యాచ్... టాస్ అప్ డేట్ ఇదిగో!

Sunrisers Hyderabad vs Gujarat Titans Match Update  Toss Result
  • చివరిగా ఏప్రిల్ 25న మ్యాచ్ ఆడిన సన్ రైజర్స్
  • విరామం లభించడంతో మాల్దీవులు వెళ్లొచ్చిన హైదరాబాద్ టీమ్
  • నేడు అహ్మదాబాద్ లో గుజరాత్ టైటాన్స్ తో సన్ రైజర్స్ ఢీ
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ 
పాట్ కమిన్స్ నాయకత్వంలోని సన్ రైజర్స్ హైదరాబాద్ కాస్త గ్యాప్ తర్వాత మ్యాచ్ ఆడుతోంది. చివరిగా ఏప్రిల్ 25న చెన్నై సూపర్ కింగ్స్ తో ఆడిన సన్ రైజర్స్ ఆ మ్యాచ్ లో నెగ్గింది. విరామం రావడంతో సన్ రైజర్స్ ఆటగాళ్లు మాల్దీవులకు విహారయాత్రకు వెళ్లొచ్చారు. ఇవాళ సన్ రైజర్స్ టీమ్ గుజరాత్ టైటాన్స్ తో తలపడుతోంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక. టాస్ గెలిచిన సన్ రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది. 

ఈ మ్యాచ్ కోసం జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని ఎస్ఆర్ హెచ్ కెప్టెన్ కమిన్స్ వెల్లడించాడు. మరోవైపు, గుజరాత్ టైటాన్స్ జట్టులో ఒక మార్పు చోటుచేసుకుంది. కరీమ్ జనత్ స్థానంలో గెరాల్డ్ కోట్జీ ఆడుతున్నాడు. 

పాయింట్ల విషయానికొస్తే... సన్ రైజర్స్ ఇప్పటివరకు 9 మ్యాచ్ లు ఆడి 3 విజయాలు మాత్రమే సాధించింది. పాయింట్ల పట్టికలో సన్ రైజర్స్ 9వ స్థానంలో కొనసాగుతోంది. అటు, గుజరాత్ టైటాన్స్ పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉంది. గుజరాత్ ఇప్పటిదాకా 9 మ్యాచ్ లు ఆడి 6 విజయాలతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

సన్ రైజర్స్ ఇకపై తాను ఆడే ప్రతి మ్యాచ్ లోనూ గెలిస్తేనే ప్లే ఆఫ్ అవకాశాలు ఉంటాయన్న నేపథ్యంలో... నేడు గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో చావోరేవో అన్నట్టుగా బరిలో దిగుతోంది. 
Sunrisers Hyderabad
Gujarat Titans
Pat Cummins
IPL 2023
Cricket Match
Ahmedabad
Narendra Modi Stadium
Points Table
SRH vs GT
Gerald Coetzee

More Telugu News