డోజ్ బౌద్ధ మతంలాంటిది... నేను తప్పుకుంటున్నా: ఎలాన్ మస్క్

  • డోజ్‌ ఒక జీవన విధానమన్న మస్క్
  • తాను లేకున్నా డోజ్ కార్యకలాపాలు కొనసాగుతాయని స్పష్టం
  • ప్రభుత్వ వ్యయంలో ట్రిలియన్ డాలర్లు తగ్గించడమే డోజ్ లక్ష్యమని వెల్లడి
అమెరికా ప్రభుత్వంలో సంస్కరణల కోసం ఏర్పాటు చేసిన 'డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ' (డోజ్) నుంచి తాను వైదొలగనున్నట్లు ఎలాన్ మస్క్ ధ్రువీకరించారు. మే నెలాఖరులో ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తాను లేకపోయినా డోజ్ కార్యకలాపాలు ఆగవని స్పష్టం చేశారు.

డోజ్‌ను బౌద్ధమతంతో పోలుస్తూ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "డోజ్ అనేది బౌద్ధమతం లాంటిది. అదొక జీవన విధానం. బుద్ధుడు లేకుండా బౌద్ధమతం ఎలా కొనసాగుతుందో, నేను లేకున్నా డోజ్ అలాగే కొనసాగుతుంది" అని పేర్కొన్నారు. దీనికి నిర్దిష్టమైన నాయకుడు అవసరం లేదని, ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించేందుకు ఇది నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. జులై 2026 నాటికి ప్రభుత్వ వ్యయంలో ట్రిలియన్ డాలర్లు తగ్గించడమే లక్ష్యమని, ఇప్పటికే 160 బిలియన్ డాలర్ల ఆదా సాధించామని మస్క్ వివరించారు. తన నిష్క్రమణ తర్వాత డోజ్ కార్యకలాపాలు మరింత ఊపందుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 



More Telugu News