'వేవ్స్‌' సమ్మిట్‌కు హాజ‌రైన చిరంజీవి.. ఇదిగో వీడియో!

     
దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యిలోని జియో వ‌రల్డ్ సెంట‌ర్‌లో ప్ర‌పంచ ఆడియో విజువ‌ల్ అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ స‌మ్మిట్ (WAVES) 2025 ప్రారంభ‌మైంది. కేంద్ర సమాచార ప్ర‌సార మంత్రిత్వ శాఖ‌, మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న ఈ స‌మ్మిట్ ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు సాగ‌నుంది. 

ఇప్ప‌టికే ఈ మెగా ఈవెంట్‌కు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ న‌టులు ఆమిర్ ఖాన్‌, అక్ష‌య్ కుమార్, మోహ‌న్‌లాల్ త‌దిత‌రులు చేరుకున్నారు. వీరికి నిర్వాహ‌కులు ఘ‌న స్వాగ‌తం పలికారు. బుధ‌వార‌మే చిరంజీవి ఈ కార్య‌క్ర‌మం కోసం హైద‌రాబాద్ నుంచి ముంబ‌యి చేరుకున్న విష‌యం తెలిసిందే. 

కాగా, ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఈ మొదటి ప్రపంచ ఆడియో విజువల్ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ ను ప్రారంభించనున్నారు. ఇది మీడియా, వినోద పరిశ్రమల‌ను ఒకచోట చేర్చే నాలుగు రోజుల కార్యక్రమం. ఇక్కడ ఆయన మీడియా, వినోద రంగానికి చెందిన సీఈఓలు, పరిశ్రమల ప్రముఖులతో భేటీ కానున్నారు. ఈ కార్య‌క్ర‌మం కోసం ప్ర‌ధాని మోదీ ఏకంగా 10 గంట‌ల స‌మ‌యాన్ని కేటాయించ‌డం విశేషం. 


More Telugu News