ATM Charges Hike: బిగ్ అలర్ట్.. నేటి నుంచి ఏటీఎం ఛార్జీల బాదుడు షురూ!

Big Alert ATM Charges Increased from Today
  • మే 1 నుంచి ఏటీఎం ఇంటర్ చేంజ్ ఛార్జీలు పెంచుకునేందుకు ఆర్‌బీఐ ఆమోదం
  • ఉచిత ట్రాన్సాక్షన్ లిమిట్ దాటితే ఏటీఎం విత్ డ్రా ఛార్జీలు రూ.21 నుంచి రూ. 23కు పెంపు
  • మెట్రో నగరాల్లో 3, నాన్ మెట్రో ప్రాంతాల్లో 5 ఉచిత ఏటీఎం లావాదేవీలకు అవ‌కాశం
  • ఈ లిమిట్ దాటితే ఛార్జీల బాదుడే
ఈ నెల ప్రారంభం నుంచే కొన్ని ఆర్థిక పరమైన అంశాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. అందులో ప్రధానంగా ఏటీఎం క్యాష్ విత్ డ్రా ఛార్జీల పెంపు. మే 1 నుంచి బ్యాంకుల్లో ఏటీఎం ట్రాన్సాక్షన్స్ ఛార్జీలు పెరిగాయి. దీంతో మనం అదనపు ట్రాన్సాక్షన్స్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. చేశామంటే జేబుకు చిల్లు పడినట్లే.

మే 1 నుంచి ఏటీఎం ఇంటర్ చేంజ్ ఛార్జీలు పెంచుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆమోదం తెలిపింది. వేరే బ్యాంక్ ఏటీఎం ఉపయోగించినప్పుడు రెండు బ్యాంకుల మధ్య ఈ ఛార్జీలు ఉంటాయి. అలాగే ఉచిత ట్రాన్సాక్షన్ లిమిట్ దాటితే ఏటీఎం విత్ డ్రా ఛార్జీలు రూ.21 నుంచి రూ. 23కు పెంచారు. మెట్రో నగరాల్లో 3, నాన్ మెట్రో ప్రాంతాల్లో 5 ఉచిత ఏటీఎం లావాదేవీలు ఉంటాయి.

"ఉచిత లావాదేవీలకు మించి చేస్తే, ఒక కస్టమర్‌కు ప్రతి లావాదేవీకి గరిష్టంగా రూ.23 రుసుము వసూలు చేయవచ్చు. ఇది 2025 మే 1 నుంచి అమలులోకి వస్తుంది" అని ఆర్‌బీఐ ప్ర‌క‌టించింది. మే 1 నుంచి ఏటీఎం ట్రాన్సాక్షన్స్ ఛార్జీలు పెంచుతున్నట్లు వెల్లడించింది. ఎందుకంటే ఏటీఎం నిర్వహణ ఖర్చులు పెరగడం, సెక్యూరిటీ కోసం ఖర్చులు ఎక్కువగా అయ్యాయని చెబుతోంది. 

ఇప్పటివరకూ ఉచిత ట్రాన్సాక్షన్లకు మించి మనీ విత్‌డ్రా చేస్తే, దానికి రూ.21 తీసుకునేవారు. మే 1 నుంచి.. రూ.23 తీసుకుంటారు. దీనికి మళ్లీ అదనంగా టాక్స్ కూడా ఉంటుంది. 

ఏటీఎం ఇంటర్‌చేంజ్ రుసుము 
ఏటీఎం (ATM) ఇంటర్‌చేంజ్ రుసుమును ఏటీఎం నెట్‌వర్క్ నిర్ణయిస్తుందని ఆర్‌బీఐ పేర్కొంది. ప్రస్తుతం అన్ని కేంద్రాలలో ప్రతి లావాదేవీకి ఇంటర్‌చేంజ్ రుసుము ఆర్థిక లావాదేవీలకు రూ.19 మరియు ఆర్థికేతర లావాదేవీలకు రూ.7గా ఉంది. ఏటీఎం ఇంటర్‌చేంజ్ ఫీజు అనేది ఒక బ్యాంకు తన కస్టమర్లకు ఏటీఎం సేవలను అందించడానికి మరొక బ్యాంకుకు చెల్లించే ఛార్జీ. 
ATM Charges Hike
ATM Transaction Charges
RBI ATM Rules
ATM Interchange Fee
ATM withdrawal charges
Bank ATM Fees
ATM Fee Increase
India ATM Charges

More Telugu News