Nandamuri Balakrishna: ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లిన బాలయ్య .. ఎందుకంటే ..?

Balakrishnas RTO Visit for New Car Registration
  • తన నూతన బీఎండబ్ల్యూ కారు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొరకు ఆర్టీవో కార్యాలయానికి వచ్చిన నందమూరి బాలకృష్ణ
  • కార్యాలయంలో ఫోటో దిగి, సంబంధిత పత్రాలపై సంతకాలు చేసిన బాలకృష్ణ
  • ఆర్టీవో కార్యాలయం వద్ద తీసిన బాలకృష్ణ వీడియో సోషల్ మీడియాలో వైరల్
సినీ నటుడు నందమూరి బాలకృష్ణ బుధవారం ఖైరతాబాద్ రవాణాశాఖ (ఆర్టీవో) కార్యాలయానికి విచ్చేశారు. ఆయన తన నూతన కారు రిజిస్ట్రేషన్ నిమిత్తం ఆర్టీవో కార్యాలయానికి వెళ్లి సంబంధిత ప్రక్రియను పూర్తి చేశారు.

రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా బాలకృష్ణ ఆర్టీవో కార్యాలయంలో ఫోటో దిగి, సంతకం చేశారు. ఇటీవల బాలకృష్ణ తన నూతన బీఎండబ్ల్యూ కారు కోసం రవాణాశాఖకు రూ.7,75,000లు చెల్లించి టీజీ 09ఎఫ్ 0001 ఫ్యాన్సీ నెంబర్‌ను వేలం ద్వారా సొంతం చేసుకున్నారు. నటుడు బాలకృష్ణ తమ కార్యాలయానికి వచ్చి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు హైదరాబాద్ జేటీసీ రమేష్ తెలిపారు.

కాగా, బాలకృష్ణ ఆర్టీవో కార్యాలయానికి వస్తున్నారని తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఆర్టీవో కార్యాలయం వద్ద అభిమానులు తీసిన బాలకృష్ణ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. షూటింగ్ నుంచి నేరుగా, నిరాడంబరంగా బాలకృష్ణ ఆర్టీవో కార్యాలయానికి వచ్చి వెళ్లిన తీరుపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోను అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ తమ స్పందనను తెలియజేస్తున్నారు. 

Nandamuri Balakrishna
Balakrishna RTO Visit
Hyderabad RTO
New Car Registration
BMW Car
Fancy Number Plate
TG 09 F 0001
Balakrishna Fans
Viral Video
Celebrity News

More Telugu News