విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్

--
హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన పెద్ద అంబర్ పేట వద్ద రోడ్డు ప్రమాదం జరగడంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) సమీపంలోని సంపూర్ణ హోటల్‌ ముందు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో సిటీ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఓఆర్‌ఆర్‌ సమీపం నుంచి కొత్తగూడెం వరకు హైవేపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించేందుకు చర్యలు చేపట్టారు.


More Telugu News