పహల్గామ్ దాడి వెనక లష్కర్ కమాండర్ కీలక పాత్ర

  • ఉగ్రదాడికి సాయం చేసిన ఫరూక్ అహ్మద్
  • కశ్మీర్ లోయపై అతడికి పూర్తి అవగాహన
  • స్లీపర్ సెల్స్ ద్వారా గత రెండేళ్లుగా కశ్మీర్‌లో ఉగ్రదాడులు
పహల్గామ్ ఉగ్రదాడి వెనుక లష్కరే తోయిబా కమాండర్ ఫరూక్ అహ్మద్ కీలక పాత్ర పోషించిన విషయం వెలుగులోకి వచ్చింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) వర్గాలు ఈ మేరకు వెల్లడించాయి. ఉగ్రవాదుల ఇళ్ల కూల్చివేతలో భాగంగా కుప్వారాలోని అహ్మద్ ఇంటిని ఇటీవల భద్రతా బలగాలు కూల్చివేశాయి. 

అహ్మద్ ప్రస్తుతం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. తన స్లీపర్ సెల్ నెట్‌వర్క్ ద్వారా గత రెండేళ్లుగా కశ్మీర్‌లో పలు ఉగ్రదాడులు నిర్వహించడంలో అహ్మద్ కీలక పాత్ర పోషించాడు. పాకిస్థాన్‌లోని మూడు సెక్టార్ల నుంచి కశ్మీర్‌లోకి ఉగ్రవాదులు చొరబడేందుకు అహ్మద్ సహకరిస్తున్నట్టు ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. ఈ లష్కర్ కమాండర్‌కు లోయలోని పర్వత మార్గాల గురించి విస్తృతమైన పరిజ్ఞానం ఉందని పేర్కొన్నాయి.


More Telugu News