Indian Stock Market: కొనుగోళ్లకు మొగ్గు చూపని ఇన్వెస్టర్లు... స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Indian Stock Market Ends Slightly Higher Despite Low Investor Interest

  • 70 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 7 పాయింట్లు లాభపడ్ద నిఫ్టీ
  • 2 శాతానికి పైగా పెరిగిన రిలయన్స్, టెక్ మహీంద్రా

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు ఊగిసలాట ధోరణిని ప్రదర్శించాయి. కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు పెద్దగా ఆసక్తిని చూపించలేదు. రిలయన్స్, ఇన్ఫోసిస్ వంటి బ్లూ చిప్ కంపెనీలు రాణించాయి. 

ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 70 పాయింట్ల లాభంతో 80,288 వద్ద ముగిసింది. నిఫ్టీ 7 పాయింట్లు పెరిగి 24,335 వద్ద స్థిరపడింది. డాలరుతో మన రూపాయి మారకం విలువ రూ. 85.25గా కొనసాగుతోంది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
రిలయన్స్ (2.32%), టెక్ మహీంద్రా (2.14%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.42%), ఇన్ఫోసిస్ (1.03%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (0.82%).

టాప్ లూజర్స్:
సన్ ఫార్మా (-2.01%), అల్ట్రాటెక్ సిమెంట్ (-1.99%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.75%), ఎన్టీపీసీ (-1.22%), కోటక్ బ్యాంక్ (-0.93%). 

Indian Stock Market
Sensex
Nifty
Stock Market Trends
Reliance
Infosys
Blue Chip Stocks
Market Gains
Investor Sentiment
Rupee Dollar Exchange Rate
  • Loading...

More Telugu News