బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు గాయం

  • జిమ్‌లో వర్కౌట్ చేస్తుండగా గాయం
  • సోషల్ మీడియా వేదికగా స్వయంగా వెల్లడించిన కేటీఆర్
  • వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నట్లు వెల్లడి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వల్పంగా గాయపడ్డారు. హైదరాబాద్‌లోని ఒక జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్ని కేటీఆర్ స్వయంగా సామాజిక మాధ్యమం 'ఎక్స్' ద్వారా వెల్లడించారు.

రోజూవారీ వ్యాయామంలో భాగంగా జిమ్‌లో వర్కవుట్ చేస్తుండగా తాను గాయపడినట్లు కేటీఆర్ తెలిపారు. దీంతో వైద్యులను సంప్రదించగా, వారు కొన్ని రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం తాను వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నానని కేటీఆర్ తన పోస్టులో వివరించారు. గాయం నుంచి త్వరగా కోలుకొని, వీలైనంత త్వరగా తన రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొంటానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


More Telugu News