Sreeleela: ఇంతకీ శ్రీలీల ముద్దాడుతున్న ఆ పాప ఎవరు?

Sreeleelas Adorable Baby Photos Go Viral
  • ఇన్ స్టాగ్రామ్ లో ఆసక్తికర ఫొటోలు పంచుకున్న శ్రీలీల
  • మా ఇంటికి కొత్త సభ్యురాలు వచ్చిందంటూ క్యాప్షన్
  • నెటిజన్లలో చర్చ
ప్రముఖ యువ కథానాయిక శ్రీలీల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్న కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ పసిపాపను ఎత్తుకుని ముద్దాడుతున్న దృశ్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోలతో పాటు ఆమె పెట్టిన క్యాప్షన్, గతంలో ఆమె చేసిన సేవా కార్యక్రమాల నేపథ్యంలో పలు చర్చలకు దారితీస్తోంది.

శ్రీలీల తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ చిన్న పాపతో ఉన్న ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. ఆ ఫోటోలలో పాపాయిని ఎంతో ప్రేమగా చేతుల్లోకి తీసుకుని, ముద్దుపెడుతూ కనిపించారు. ఇద్దరి ముఖాల్లో చిరునవ్వులు వెల్లివిరిశాయి. ఈ ఫోటోలకు "మా ఇంటికి కొత్త సభ్యురాలు.. మా మనసు దోచేసింది" (Addition to the house, Invasion of the hearts) అంటూ ఒక తెల్ల హార్ట్, దిష్టి తగలకూడదనే ఎమోజీలను జోడించి పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌కు ఏ.ఆర్. రెహమాన్ స్వరపరిచిన "ఛోటీ సీ ఆశా" పాటను నేపథ్య సంగీతంగా జతచేయడం విశేషం.

ఈ పోస్ట్ చూసిన అభిమానులు, నెటిజన్లు శ్రీలీలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే, ఆ చిన్నారి శ్రీలీల కుటుంబ సభ్యురాలా లేక ఆమె మరో చిన్నారిని దత్తత తీసుకున్నారా అనే దానిపై స్పష్టత లేదు. చాలామంది ఆమె మళ్లీ దత్తత తీసుకుని ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు. శ్రీలీల గతంలోనూ తన గొప్ప మనసును చాటుకున్నారు. ఫిబ్రవరి 2022లో, తన 21వ ఏట, గురు, శోభిత అనే ఇద్దరు దివ్యాంగ పిల్లలను ఓ అనాథాశ్రమం నుంచి దత్తత తీసుకున్నారు. ఆ ఆశ్రమాన్ని సందర్శించినప్పుడు ఆ పిల్లలతో ఏర్పడిన ప్రత్యేక అనుబంధం కారణంగా వారికి మెరుగైన జీవితాన్ని అందించాలని నిర్ణయించుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
Sreeleela
Sreeleela Baby Photos
Sreeleela Adoption
Tollywood Actress
Viral Photos
Social Media
Instagram
Child Adoption
A.R. Rahman
Choti Si Asha

More Telugu News