తిరుప‌తి జిల్లాలో ఘోర ప్ర‌మాదం.. ఐదుగురు దుర్మ‌ర‌ణం

    
తిరుప‌తి జిల్లాలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. పూత‌ల‌ప‌ట్టు-నాయుడుపేట జాతీయ ర‌హ‌దారిపై పాకాల మండ‌లం తోట‌ప‌ల్లి వ‌ద్ద కంటైన‌ర్ కిందకు కారు దూసుకెళ్లింది. ఈ ఘ‌ట‌న‌లో ఐదుగురు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. మ‌రో ఇద్ద‌రికి తీవ్ర గాయాల‌య్యాయి. 

స‌మాచారం అందుకున్న పోలీసులు ప్ర‌మాద‌స్థ‌లికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. గాయ‌ప‌డిన వారిని స‌మీపంలోని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. 


More Telugu News